NTV Telugu Site icon

Sai Rajesh: ఆ కారణంగా బేబీ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి ని తీసుకున్నాము.

Whatsapp Image 2023 07 24 At 2.36.12 Pm

Whatsapp Image 2023 07 24 At 2.36.12 Pm

హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ మూవీని సాయి రాజేష్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ఆడియన్స్ తెగ నచ్చేసింది.దీనితో ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ పెరిగారు.. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు తమ నటనతో ఎంతగానో మెప్పించారు.చాలా మంది సినీ ప్రముఖులు బేబి మూవీ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సాయి రాజేష్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ..ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవిని తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. నేను సినిమా కథ అనుకున్నప్పుడు తెలంగాణ అమ్మాయి కావాలని అయితే అనుకున్నాను. తెలంగాణ భాష మీద బాగా పట్టుండాలి అలాంటి అమ్మాయి అయితే నా కథకి పూర్తి న్యాయం చేస్తుందని భావించాను.వెంటనే మా మేనేజర్ వైష్ణవి ఫోటో చూపించగా నేను తనని సంప్రదించాను. వైష్ణవికి కథ చెప్పినప్పుడు ముందు అస్సలు ఒప్పుకోలేదు. తర్వాత నేను తీసే సన్నివేశాలు ప్రతి ఒక్క షాట్ ను అమెకి బాగా వివరించాను. అందులో నీకు నచ్చకుంటే మళ్లీ వేరే షాట్ తిద్దాం అని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు.ఆ తర్వాత డైరెక్ట్ గా షూటింగ్ కు వెళ్లిపోయాం. నేను చెప్పిన ప్రతి సీన్‌లో తను ఎంతో అద్బుతంగా నటిచింది ఫ్యూచర్ లో వైష్ణవి మంచి హీరోయిన్ అవుతుంది అని చెప్పుకొచ్చారు సాయి రాజేష్. ఈ . సినిమా ఇంత మంచిగా రావడానికి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ నా కృతజ్ఞతలు అని దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు

Show comments