NTV Telugu Site icon

Sai Pallavi: అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సాయి పల్లవి..

Whatsapp Image 2023 07 15 At 5.17.12 Pm

Whatsapp Image 2023 07 15 At 5.17.12 Pm

సాయి పల్లవి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుత నటనతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ భామ.ప్రస్తుతం ఈ భామ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది.తాజాగా సాయి పల్లవి తన కుటుంబంతో కలిసి అమర్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది.ఆలయ సందర్శన తర్వాత కొన్ని ఫొటోలను అలాగే తన అనుభవాలను షేర్ చేసుకుంది.. అమర్‌నాథ్ యాత్ర కు ఎప్పటినుంచో వెళ్లాలని అనుకుందట ఈ భామ. తాజాగా ఈ భామ అమర్నాధ్ ఆలయాన్ని సందర్శించడంతో అక్కడ తన అనుభవాలను  ఈ విధంగా రాసుకొచ్చింది.నేను నా వ్యక్తిగత విషయాలను అస్సలు షేర్ చేసుకోను. కానీ ఈ యాత్ర గురించి మాత్రం మీకు చెప్పాలని ఉంది. ఈ యాత్రను ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను. అరవై ఏళ్లు వచ్చిన నా తల్లిదండ్రులతో ఈ యాత్ర అనుభవం మీకు తెలియజేయాలి అని అనుకున్నాను.. కొండలు, గుట్టలు ఎక్కలేక, నడవలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఆయసపడుతూ ఊపిరి బిగపట్టుకుని మంచులో నడుస్తుంటే దేవుడా నువ్వు ఎందుకు ఇంత దూరంలో ఉన్నావ్ అని అనిపించింది.అయితే దర్శనం అయిన తర్వాత తిరిగి వస్తుంటే దేవుడు ఎందుకు ఇంత దూరంలో వున్నాడో అర్థమైంది.

కొండలు దిగి వచ్చిన తర్వాత కింద యాత్రికులు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తున్నారు. అందరికీ బాగా ఓపిక వచ్చేసింది. అలసట వచ్చిన ప్రతీసారి అలాగే నడవలేమని అనుకున్న ప్రతీసారి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తులు జపిస్తున్నారు.. ఆ యాత్రలో మెుత్తం ఆ నామమే మారు మ్రోగింది.ఆ పరమ శివుణ్ణి దర్శించుకోవాలని ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తుల కోసం ఈ యాత్రను సురక్షితంగా నిర్వహిస్తున్న బోర్డుకు నా ధన్యవాదాలు. ఎలాంటి స్వార్థం లేకుండా పని చేస్తున్న ఆర్మీ, సీఆర్పీఎఫ్ మరియు పోలీసులకు కృతజ్ఞతలు.మనల్ని ఎల్లప్పుడు వారు కాపాడుతూనే ఉంటారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న స్థలం కాబట్టే  దీనికి గొప్ప పేరు వచ్చింది. ఎదుటి వాళ్లకు సేవ చేయడమే మన జీవితానికి వున్న పరమార్థం. నా విల్ పవర్ ను అమర్ నాథ్ యాత్ర ఛాలెంజ్ చేసింది. నన్ను, నా బలాన్ని బాగా పరీక్షించింది. జీవితమంటేనే ఓ యాత్ర అని నాకు తెలియజేసింది అంటూ అమర్నాధ్ యాత్ర అనుభవాలు తెలియజేసింది.