టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తర్వాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి డాన్స్ వీడియో ఒకటి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..
సాయి పల్లవి కాలేజ్ ఫెస్ట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అప్పట్లో ఇలానే విదేశాల్లో సాయి పల్లవి చదువుకుంటున్న రోజుల్లో వచ్చిన డ్యాన్స్ వీడియో ఒకటి ఊపేసింది… అప్పట్లో డ్యాన్స్ ఇరగదీసింది.. షీలా కీ జవానీ పాటకు ఆమె వేసిన డ్యాన్స్ కు నెటిజన్స్, అభిమానులు ఫిదా అవుతున్నారు.. లేడి మైకేల్ జాక్సన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. గతంలో ఢీ కంటెస్టెంట్‌గానూ వచ్చిన సంగతి తెలిసిందే..
ఇక సినిమాల విషయానికొస్తే.. ఫిదా సినిమాతో జనాలను ఫిదా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అలాగే హిందీ రామాయణంలో నటిస్తోందనే రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారట.. ఆ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ ను తీసుకోందని వార్తలు వినిపిస్తున్నాయి..
#SaiPallavi in Sheela ki Jawani Song at her College Fest 🥵🥵🥵🥵🥵
— GetsCinema (@GetsCinema) April 16, 2024