NTV Telugu Site icon

Sai Pallavi : చీరకట్టులో సాయిపల్లవి డ్యాన్స్.. ఎంత ముచ్చటగా ఉందో

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi : సాయిపల్లవి అంటేనే డ్యాన్స్.. ఆమె వేసే స్టెప్పులకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో ఆమెలాగా స్టెప్పులు వేసే హీరోయిన్లే లేరు. అందులోనూ సాయిపల్లవి సినిమాల్లో కనిపించే తీరుకే స్పెషల్ క్రేజ్ ఉంది. మిగతా హీరోయిన్లలాగా ఎక్స్ పోజింగ్ కు ఒప్పుకోదు. ఎలాంటి వల్గర్ క్యారెక్టర్ చేయదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అస్సలు ఒప్పుకోదు. అలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను మిస్ చేసుకుంది. సినిమాలు పోయినా సరే తన వ్యక్తిత్వం మాత్రం మార్చుకోదు. అందుకే ఆమెకు హీరోయిన్ గా కంటే ఆమె బిహేవియర్ కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాల్లో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే.

Reas Also : Amrutha: ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై స్పందించిన అమృత..

సాయిపల్లవి కూడా తన పాత్రలో అలా ఒదిగిపోతుంది. రీసెంట్ గానే తండేల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ మూవీతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో రామాయణం బేసిక్ గా వచ్చే భారీ సినిమాలో సీత పాత్ర చేస్తోంది. ఇలా కెరీర్ లో బిజీగా ఉండే సాయిపల్లవి.. తాజాగా మరోసారి డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. తన సోదరుడి పెళ్లిలో చీరకట్టులోనే స్టెప్పులు వేసింది. చీరలో నిండైన అందంతో అలా స్టెప్పులు వేసి అబ్బురపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన ఫ్యాన్స్.. వావ్ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. బయట కూడా చీరకట్టులో మెరిసే హీరోయిన్ కేవలం సాయిపల్లవి మాత్రమే అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Reas Also : Sai Kumar : సాయికుమార్ కు కొమరం భీమ్ పురస్కారం