Site icon NTV Telugu

Sai Durgha Tej: సెకండ్ క్లాస్‌లోనే నా లవ్ స్టోరీని అమ్మతో చెప్పా.. పిల్లలకు పేరెంట్స్‌ స్వేచ్ఛ ఇవ్వాలి!

Sai Dharam Tej

Sai Dharam Tej

ప్రస్తుత రోజుల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదని ‘సుప్రీం హీరో’ సాయి దుర్గా తేజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడంటే చాట్ జీటీపీ, ఏఐ అంటున్నారు కానీ.. అప్పుడైనా, ఇప్పుడైనా తనకు మాత్రం అమ్మే ప్రపంచం అని చెప్పారు. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలని కోరారు. తన సెకండ్ క్లాస్‌లోని లవ్ స్టోరీని అమ్మతో చెప్పానని.. అలా పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. ప్రస్తుత రోజుల్లో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలని సాయి దుర్గా తేజ్‌ చెప్పుకొచ్చారు. అభయం మసూమ్‌-25 ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు సుప్రీం హీరో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

‘ఈరోజుల్లో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సోషల్ మీడియాలో పిల్లల మీద చాలా అబ్యూజ్ చేస్తున్నారు. అసభ్యంగా కామెంట్లు చేస్తే కూడా కొందరు లైక్స్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. అవన్నీ చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మనం ఇలాంటి సమాజాన్ని కోరుకుంటున్నామా?, చిన్న పిల్లల మీద అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం ఏంటి? అని అనుకున్నా. ఎవరైనా మాట్లాడాతారా?, మీడియా స్పందిస్తుందా? అని చూశాను. కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఆ బాధ్యతను నేనే తీసుకున్నాను. అందుకే ఆ సమయంలో రియాక్ట్ అయ్యాను. డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది కానీ.. ఎదుటి వాళ్లని బాధ పెట్టే విధంగా మాత్రం ఉండకూడదు’ అని సాయి దుర్గా తేజ్‌ అన్నారు.

Also Read: Health Tips: ఈ 5 నాచురల్ ఫుడ్‌తో ప్రోటీన్ సమస్య ఇట్టే దూరం.. కరీనా కపూర్ కూడా ఇదే ఫాలో అవుతారు!

‘2015 లో థింక్ పీస్ అనే సంస్థతో నేను పని చేశాను. అరకులో చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి పోరాడాను. అక్కడ స్కూల్ నిర్మించాను. తెలంగాణలో కొంత మంది పిల్లల్ని దత్తత తీసుకున్నా. పిల్లల చదువు, పోషణ.. ఇలా అన్నింటినీ చూసుకుంటాను. ఈరోజుల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. చాట్ జీటీపీ, ఏఐ అంటున్నారు కానీ.. నాకు మాత్రం మా అమ్మే ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులతో నేను సమయాన్ని ఎక్కువగా గడిపేవాడిని. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. నేను నా సెకండ్ క్లాస్‌లోని లవ్ స్టోరీని మా అమ్మతో చెప్పా. అలా చెప్పే స్వతంత్రాన్ని నాకు అమ్మ ఇచ్చారు. పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా.. పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలకు ప్రతీ విషయాన్ని ప్రేమతో చెప్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ తప్పకుండా చెప్పాలి’ అని సుప్రీం హీరో కోరారు.

Exit mobile version