NTV Telugu Site icon

Sagileti Katha: వెండితెరపైకి రాయలసీమ మట్టికథ!

Sagileti Katha

Sagileti Katha

Sagileti Katha: రాయలసీమ నేపథ్యంలో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే అందులో అత్యధిక భాగం సీమలోని ఫ్యాక్షన్ రాజకీయాలనే ప్రతిబింబించేలా తెరకెక్కించారు. వాటికి భిన్నంగా ‘కొండపొలం’ లాంటి సినిమాలూ కొన్ని వచ్చాయి. ఇప్పుడు తాజాగా ‘సగిలేటి కథ’ పేరుతో రాయలసీమ మట్టి కథ ఒకటి రూపుదిద్దుకుంటోంది. అశోక్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై రవితేజ మహాదాస్యం, విషిక హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కేన్స్ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ఫిలిం ఫెస్టివల్ లో తన ప్రతిభను చాటుకున్న రాజశేఖర్ సుడ్మూన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అశోక్ మిట్టపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో చిత్రీకరించబడిన ఒక అందమైన మట్టి కథ, అక్కడి మనుషుల కథ ఇదని మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా చిత్రం బృందం తెలిపింది.

Hero Havish: ‘భాగమతి’ దర్శకుడితో కలిసి హవీశ్ ‘ఎస్ బాస్’!

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు ఇటువంటి నేటివిటీని ఎప్పుడు చూసి ఉండరు. ఈ చిత్రంలోని భావోద్వేగాలు మిమ్మల్ని కదిలిస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఇందులో పాత్రలతో మీరు మాట్లాడబోతున్నారు అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పాత్ర ఒక కల్ట్ క్యారెక్టర్. ఒక అద్భుతమైన రాయలసీమ కథను త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాం” అని తెలిపారు