Site icon NTV Telugu

Sachin Tendulkar: 2011 వరల్డ్‌కప్‌ టైమ్‌లో సత్యసాయి బాబా నాకు ఫోన్‌ చేశారు.. ఆ ఏడాదిలోనే ట్రోఫీ గెలిచాం..

Sachin

Sachin

Sachin Tendulkar: సత్యసాయి బాబా బోధనలు నాలో ఎంతో ప్రేరణను ఇచ్చాయని.. ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు తన వెంట్రుకలు సత్యసాయిలా ఉన్నాయనే వారని మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు.. తమ మదిలో ఎన్నో ప్రశ్నలకు బాబా దగ్గర సమాధానాలు దొరికాయన్నారు.. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో సచిన్ మాట్లాడారు. బాబా బోధనలు తనను మార్గదర్శనం చేశాయని.. బాబా ఆశీస్సులతో జీవితంలో ఎన్నో సాధించానని చెప్పుకొచ్చారు. ప్రజలను ఎప్పుడు జడ్జ్ చేయొద్దని వారిని అర్థం చేసుకోవాలని బాబా నాతో చెప్పారు. దీని వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయన్నారని గుర్తు చేసుకున్నారు.

READ MORE: Shriya Saran: “అది నేను కాదు” – ఫేక్‌ వాట్సప్‌ అకౌంట్‌ పై స్పందించిన శ్రియ

2011 వరల్డ్‌కప్‌ నాటి రోజులను సచిన్ గుర్తు చేసుకున్నారు. 2011 వరల్డ్‌కప్‌ ఆడుతున్నప్పుడు తాను ఎంతో భావోద్వేగంగా ఉండేవాడినన్నారు. ఈ మ్యాచ్ అడేటప్పుడు బెంగళూరులో ఉన్నామని.. ఆ సమయంలో సత్య సాయిబాబా తన ఫోన్‌ చేసినట్లు సచిన్ గుర్తు చేసుకున్నారు. తను ఓ పుస్తకం సైతం పంపినట్లు చెప్పారు. ఆ పుస్తకం తనకు సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని ఇచ్చిందని.. ఆ ఏడాదిలో ట్రోఫీ కూడా గెలుచుకున్నామన్నారు. అది నాకు గోల్డెన్‌ మూమెంట్‌ అని సచిన్ చెప్పాడు..

READ MORE: Kinetic Green Electric 3 Wheelers: ఎలక్ట్రిక్ 3-వీలర్ వాహనదారులకు నో టెన్షన్.. ఇకపై 15 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్!

 

Exit mobile version