NTV Telugu Site icon

Cricket LIVE : తగ్గేదేలే…ఇప్పటికీ నువ్వే మా హీరో

sachin

Maxresdefault

LIVE : తగ్గేదేలే...ఇప్పటికీ నువ్వే మా హీరో | NTV SPORTS

సచిన్ టెండూల్కర్.. ఆ తరం. ఈ తరం అని తేడా లేదు.. ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పేరుపొందిన టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రెండున్నర దశాబ్దాల తన సుదీర్ఘ కెరియర్ లో సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. పదేళ్లు గడిచినా వాటిలో ఇప్పటికీ కొన్ని చెక్కుచెదరకుండానే ఉన్నాయి. కొన్ని రికార్డులకు కొందరు చేరువైనా.. సచిన్ ను దాటలేకపోయారు. ఇప్పటి జనరేషన్ లో విరాట్ కోహ్లీ మాత్రమే కొన్ని రికార్డులపై కన్నేశాడు. 100 టెస్టులు ఆడటమే గొప్ప అనుకుంటే.. సచిన్ ఏకంగా 200 టెస్టులు ఆడాడు. ఈ విషయంలో ఎవ్వరూ దరిదాపుల్లో లేరు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రమే 168 టెస్టు మ్యాచ్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ అనేది పేరు కాదు.. ఒక ఎమోషన్..! సచిన్ సెంచరీకోసమే ఆడతాడు. సెంచరీ చేసిన మ్యాచ్ లు ఓడిపోతాం. సచిన్ పర్సనల్ కెరియర్ కోసమే ఆడేవాడు. స్వార్ధపరుడు.. అంటూ ఇలా కామెంట్స్ చేసే పిచ్చి పుల్కా గాళ్లకి అసలు క్రికెట్ చూడటం వచ్చా అనే సందేహం వస్తుంది.

అత్యధిక సెంచరీల రికార్డు. వన్డేలు (49), టెస్టులు (51) కలిపి 100 సెంచరీలను సచిన్ సాధించాడు. ఈ విషయంలో ఎవ్వరూ సచిన్ దరిదాపుల్లో లేరు. టెస్టుల్లో జాకస్ కలిస్ (45), వన్డేల్లో విరాట్ కోహ్లీ (46) రెండో స్థానంలో ఉన్నారు.అత్యధిక పరుగుల రికార్డు. 463 వన్డేల్లో 18,426 పరుగులు, 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్లలోనే సచినే తొలి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 34,357 రన్స్ చేశాడు. రెండో స్థానంలో ఉన్న శ్రీలంక ప్లేయర్ సంగక్కర 28,016 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 25,322 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు.అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ ఏకంగా 264 సార్లు 50, అంతకన్నా ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో వన్డేల్లోనే 145 సార్లు చేశాడు. ఈ జాబితాలోనూ రికీ పాంటింగ్ రెండోస్థానంలో ఉన్నాడు. పాంటింగ్ ఓవరాల్ గా 217 సార్లు 50 స్కోర్లు చేశాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన రికార్డు. 275 ఇన్నింగ్స్ లలో 54.40 సగటుతో 13,492 పరుగులు చేశాడు. ఇందులో 44 సెంచరీలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఉన్నాడు. ఓపెనర్ గా వచ్చే కుక్.. 278 ఇన్నింగ్స్ లలో 11,845 పరుగులు చేశాడు.ఎక్కువ ఫోర్లు కొట్టిన క్రికెటర్ గానూ సచిన్ తొలి స్థానంలో ఉన్నాడు. టెస్టులు, వన్డేల్లో 2000 పైగా ఫోర్లు కొట్టిన ఏకైక ప్లేయర్ సచిన్. టెస్టుల్లో 2058 ఫోర్లు కొట్టాడు. వన్డేల్లో 2016 ఫోర్లు బాదాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో ఫస్ట్ ఫ్లేస్ లో సచిన్ ఉన్నాడు. 1998లో కేవలం 33 ఇన్నింగ్స్ లలోనే ఏకంగా 1,894 పరుగులు చేశాడు. రెండో స్థానంలో గంగూలీ ఉన్నాడు. 41 ఇన్నింగ్స్ లలో 1,763 రన్స్ చేశాడు.

ఎక్కువ కాలం వన్డేలు ఆడిన క్రికెటర్ గానూ సచిన్ పేరు తొలి స్థానంలో ఉంది. 22 ఏళ్ల 91 రోజులు సచిన్ వన్డేలు ఆడాడు. తర్వాతి స్థానంలో శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య ఉన్నాడు. 21 ఏళ్ల 184 రోజులు ఆడాడు. ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నది సచినే. టెస్టులు, వన్డేలు కలిపి 20 సార్లు అందుకున్నాడు. ఒక టీమ్ పై ఎక్కువ సెంచరీలు కొట్టిన ప్లేయర్ సచిన్. ఆస్ట్రేలియాపై ఏకంగా 20 సెంచరీలు కొట్టాడు. ఈ విషయంలో ఆసీస్ ఆల్ టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్ మన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆయన ఇంగ్లండ్ పై 19 సెంచరీలు కొట్టాడు.

సెంచరీ రాగానే సచిన్ స్లో అయిపోతాడు అనే వాళ్లకి అతను సెంచరీ చేసే సమయానికి స్కోర్ బోర్డ్ చూసే ఓపిక ఉండదు. గబుక్కున సెంచరీ కొట్టే హడావుడిలో అవుట్ అవుతానేనో అనే భయం ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది. అందుకే 80-90 స్కోర్ రాగానే స్లో అయ్యేవాడు. అతను అవుట్ అయితే ఇండియన్ స్కోర్ బోర్ట్ అక్కడే ఆగిపోతుంది. అతను అవుట్ అవ్వగానే ప్రత్యర్థి టీమ్ ఎటాక్ చేసేస్తుంది. ఇది సచిన్ కంటే బాగా ఎవరికీ తెలియకపోవచ్చు. సచిన్ ఇప్పటికీ, ఎప్పటికీ క్రికెట్ అభిమానులకు గాడ్..