Site icon NTV Telugu

Sachin Holi Celebrations: రంగులతో సచిన్ అల్లరి అంత ఇంతా కాదుగా!

Sachin

Sachin

Sachin Holi Celebrations: దేశవ్యాప్తంగా హోలీ పండుగ నాడు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు రంగులు పూసుకుంటూ ఆనందంగా వేడుకలో ఎంజాయ్ చేసారు. హోలీ అంటే కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు కూడా ప్రత్యేకమైనదే. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ గా పిలిచే సచిన్ టెండూల్కర్ సైతం కూడా తన తోటి క్రికెటర్లతో కలిసి హోలీ వేడుకలను మరింత సందడిగా మార్చాడు.

Read Also: Health Tips: అలాంటి వ్యక్తులు నాన్ వెజ్ తినకూడదు.. తింటె ప్రమాదంలో పడ్డట్టే!

సచిన్ టెండూల్కర్ తన టీం ఆటగాళ్లైనా యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు లతో కలిసి హోలీ వేడుకల్లో మునిగిపోయాడు. రంగుల హోళీని పురస్కరించుకుని వీరంతా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వీడియోలో సచిన్ తన సహచర క్రికెటర్లతో కలిసి తొలుత యువరాజ్ సింగ్ రూమ్ వద్దకు వెళ్లి తలుపు తట్టాడు. దాంతో యువీ డోర్ తీయగానే సచిన్, ఇతర క్రికెటర్లు వాటర్ గన్స్ ద్వారా అతనిపై రంగుల దాడి చేశారు. ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటనకు యువీ ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. దాని నుండి తేరుకున్న అతడు వెంటనే మిగతావారితో కలసి మరింత ఉత్సాహంగా హోలీని ఆస్వాదించాడు.

ఇంతటితో ఆగకుండా, ఆ తర్వాత సచిన్ గ్యాంగ్ అంబటి రాయుడు రూమ్ వద్దకు వెళ్లి అతనిపై రంగుల వర్షం కురిపించింది. దానితో అంబటి రాయుడు రంగులతో తడిసిపోతూ హోలీ ఆనందాన్ని ఆస్వాదించాడు. అదే విధంగా, యూసఫ్ పఠాన్‌తో కలిసి మిగతా క్రికెటర్లు కూడా రంగులలో మునిగి తేలారు. ఇకపోతే వీరందరూ ప్రస్తుతం ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML)లో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో ఇండియా మాస్టర్స్ జట్టుకు సచిన్ కెప్టెన్ గా ఉండగా.. యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు కూడా సభ్యులుగా ఉన్నారు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో ఇండియా మాస్టర్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ పోరులో వెస్టిండీస్ తో తలపడనుంది. ఈ ఆదివారం ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు ఐఎంఎల్-2025 టైటిల్ కోసం తలపడనున్నాయి.

Exit mobile version