అంతరిక్షంలో పెద్ద ప్రమాదం తప్పింది. రెండు అగ్ర రాజ్యాలకు చెందిన రెండు ఉపగ్రహాలు అతి సమీపంలోకి వచ్చి కొంచెం దూరంలో తప్పుకున్నాయి. లేదంటే ఊహించని ప్రమాదమే జరిగేది. ప్రమాదం తప్పడంతో సైంటిస్టులు ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉపగ్రహాలను స్పేస్‌లోకి పంపిస్తున్నారంటేనే కోట్లు ఖర్చు చేస్తుంటారు. వందల కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలు గమ్యానికి చేరకపోతే కోట్లాది రూపాయలు వృధా అయిపోతాయి. అలాంటిది అమెరికా, రష్యాకు చెందిన రెండు ఉపగ్రహాలు అతిసమీపంలోకి వచ్చేశాయి. దీంతో శాస్త్రవేత్తలకు గుండె ఆగినంత పనైంది. కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
రష్యా, అమెరికాకు చెందిన 2530 కిలోల బరువున్న రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వచ్చినప్పుడు ఒక్కసారిగా కనుమరుగైపోయాయి. దీంతో శాస్త్రవేత్తలు భయాందోళనకు గురయ్యారు. ఆ రెండు ఉపగ్రహాలు సమీపంలోకి వచ్చినప్పుడు గంటకు 50,400 కిలోమీటర్ల వేగంలో ఉన్నాయి. ఒకవేళ రెండు ఢీకొంటే భారీ విధ్వంసమే జరిగి ఉండొచ్చని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే అంతరిక్షంలో రెండు అంతరిక్ష నౌకలు ముఖాముఖిగా రావడం ఇదే తొలిసారి కాదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి. కొన్ని సార్లు ఢీకొనే మార్గంలోకి వచ్చి తప్పుకుంటాయి. లేదంటే భారీ విధ్వంసాలు చోటుచేసుకునే ప్రమాదాలు ఉంటాయి.
