Site icon NTV Telugu

Telangana Assembly Elections 2023: ఎన్నికలపై డేగ కన్ను.. బందోబస్తుకే రూ. 150 కోట్ల ఖర్చు..!

Security

Security

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లలో కనివిని ఎరుగని రీతిలో చర్యలు చేపట్టింది. ఎంత వ్యయమైనా సరే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. చీమ చిటుక్కుమన్నా వాలిపోయే భద్రతా బలగాలు. ఘర్షణలకు తావులేకుండా పటిష్టమైన పహారా. కేవలం ఎన్నికల బందోబస్తు కోసమే ఎన్నికల కమిషన్‌ అక్షరాల 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందట..

Read Also: Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు!

తెలంగాణలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 119. ఇందులో సమస్యాత్మకమైనవి 106. పోలింగ్‌ కేంద్రాలు 35,655. ఈ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను వినియోగిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 50వేల మంది పోలీసులను కేటాయించింది. ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు ఏకంగా 150 కోట్లు అవుతుందని ఈసీ అంచనా వేస్తోంది. ఈ ఎన్నికల్లో కేవలం బందోబస్తు ఖర్చు రూ. 150 కోట్లు.. కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బలగాలతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే రాష్ట్ర పోలీసుల అలవెన్సులు, వాహనాలకు రూ.150 కోట్ల వరకు ఖర్చు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. గత ఎన్నికల్లో మొత్తం రూ.100 కోట్లు ఖర్చు కాగా.. ఇప్పుడు రూ.150 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయి… ఫలితాలు వెలువడే వరకు పోలీసులు విధులు నిర్వహించాల్సి ఉంది. అక్టోబర్ 9 నుంచి రాష్ట్రంలో తనిఖీల కోసం 373 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 374 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 95 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి పారామిలటరీ బలగాలు ఇలా ఖర్చు పెరుగుతూ పోయింది.

Exit mobile version