Roman Reigns: క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాట్‌తో ఫోర్లు, సిక్సర్లు కొట్టడం మీరు చూసే ఉంటారు. కానీ WWE (వరల్డ్ వైడ్ ఎంటర్‌టైన్‌మెంట్) రింగ్‌లో క్రికెట్ బ్యాట్‌తో కొట్టడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? తాజాగా ఇలాంటి దృశ్యం కనిపించింది. రెజ్లర్ రోమన్ రెయిన్స్ తన ప్రత్యర్థిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టాడు. రోమన్ రెయిన్స్ చర్య చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కొంతమంది అభిమానులకు విరాట్ కోహ్లీ గుర్తుకు వచ్చాడు. బంతిని బలంగా కొట్టేందుకు కోహ్లీ ఎలా అయితే బ్యాట్‌ను తిప్పుతాడో రోమన్ సైతం అలాగే తిప్పాడు. రోమన్ రెయిన్స్ దూకుడు, ప్రదర్శన శైలి సైతం కోహ్లీని ప్రతిబింబిస్తాయి. మైదానంలో కోహ్లీ తన దూకుడు, పోరాట పటిమకు ప్రసిద్ధి చెందాడు. అలాగే రింగ్‌లో రోమన్ సైతం అలాగే అగ్రెసివ్‌గా కనిపిస్తాడు.
READ MORE: Jubilee Hills By Election: రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..
ఈ మ్యాచ్ రోమన్ రెయిన్స్, బ్రాన్సన్ రీడ్ మధ్య ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇందులో రోమన్ ఓ బ్యాగ్ నుంచి రక్బీ బాల్స్ తీసి.. ప్రత్యేర్థి బ్రాన్సన్ రీడ్‌ను కొట్టాడు. అనంతరం అందులో నుంచి ఓ క్రీకెట్ బ్యాట్ తీశాడు రోమన్. ఆ బ్యాట్‌తో ప్రత్యర్థి బ్రోన్సన్ రీడ్ ను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత చితక బాదినప్పటికీ.. రోమన్ ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చింది. బోన్సన్ రోమన్‌ను చాకచక్యంగా ఓడించాడు.
READ MORE: Hyderabad: మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు.. కారుతో ర్యాష్ డ్రైవింగ్.. ఐదుగురికి తీవ్రగాయాలు
BATTER UP! 😮💨 pic.twitter.com/qytfaTMilR
— WWE (@WWE) October 11, 2025
