NTV Telugu Site icon

INDvsAUS 1st Test: రోహిత్ సూపర్ సెంచరీ..లీడ్‌లోకి టీమిండియా

Ro

Ro

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతోన్న తొలిటెస్టులో రెండో రోజు ఆట రసవత్తరంగా మారుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 77/1తో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఇప్పటికే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా రోహిత్ శర్మ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తనదైన శైలి ఆటతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మర్ఫీ వేసిన 63వ ఓవర్లో సూపర్ ఫోర్‌తో శతకం పూర్తి చేశాడు హిట్‌మ్యాన్, పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఒంటరి పోరాటంతో ఔరా అనిపిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 178 రన్స్ చేసింది.

Also Read: Shehzada: ఓ మై గాడ్ డాడీ ప్లేస్ లో… క్యారెక్టర్ డీలా హై…

మొదట నిలకడగా ఆడుతున్న రోహిత్-అశ్విన్ జంటను టాడ్ మర్ఫీ విడదీశాడు. 41వ ఓవర్ తొలిబంతికి అశ్విన్‌ (23)ను ఔట్ చేశాడు. కాసేపటికే పుజారా (7)ను కూడా ఔట్ చేశాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 151 రన్స్ చేసింది. లంచ్ బ్రేక్ పూర్తయి రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే కోహ్లీ(12) ని కూడా ఔట్ చేసిన మర్ఫీ ఆసీస్ క్యాంప్‌లో సంతోషం నింపాడు. కనీసం సూర్యకుమార్ అయినా కుదురుకునే ప్రయత్నం చేస్తాడనుకున్న టీమిండియా ఫ్యాన్స్ ఆశలపై లియోన్ నీళ్లు చల్లాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యను లియోన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా రోహిత్ శర్మ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.