Site icon NTV Telugu

Vyooham : వ్యూహం సినిమా కోసం సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్న ఆర్జివీ..?

Whatsapp Image 2023 11 14 At 10.59.45 Am

Whatsapp Image 2023 11 14 At 10.59.45 Am

సెన్సేషనల్ దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం వ్యూహం… ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. నిజానికి నవంబర్ 10న ఈ సినిమా విడుదల కావాలి.. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది.నిజ జీవిత పాత్రల పేర్లు, వాళ్ళ ప్రవర్తన మరియు రాజకీయ సంఘటనలు ఇలా ఎన్నో వ్యూహం సినిమాలో ఉండడంతో దాన్ని బయటికి తీసుకొస్తే.. రాజకీయ దుమారం రేగడం ఖాయమని.. ఎన్నికల సమయంలో కచ్చితంగా గొడవలు వస్తాయని భావించి  సినిమా విడుదలను సెన్సార్ బోర్డు అడ్డుకుంది.. వైయస్ జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయి వైసీపీ ని స్థాపించాక ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వ్యూహం సినిమాను ఆర్జివి తెరకెక్కించారు. సెన్సార్ సభ్యులు అడ్డుకోవడంతో దాన్ని దర్శక నిర్మాతలు ఛాలెంజ్ గా తీసుకున్నారు.. కానీ ప్లాన్ మాత్రం వర్కౌట్ కాలేదు. నవంబర్ 10 న వ్యూహం విడుదల కాలేదు. అయితే ఈ సినిమాను నేరుగా యూ ట్యూబ్ లో విడుదల చేయాలని భావిస్తున్నాడట రామ్ గోపాల్ వర్మ.

గతంలోను ఆయన సినిమాలను అలా డైరెక్ట్ గా యూ ట్యూబ్ లో విడుదల చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే చేయాలని భావిస్తున్నారు వర్మ. వ్యూహం సినిమా తెరకెక్కిస్తున్నప్పుడే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు వస్తాయి అని ఆయనకు ముందే తెలుసు. అందుకోసమే ముందుగానే ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఆ మధ్య అడిగినప్పుడు కూడా ఈ సినిమాను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని చెప్పారు.ఆర్జీవి ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం వ్యూహం.. రెండో భాగం శపథం. జనవరి 25న రెండో భాగాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది విడుదల కావడం కష్టమే అని తెలుస్తుంది.. ఎందుకంటే ఏపీ ఎన్నికలు మరింత దగ్గరకు వస్తున్న సమయంలో వర్మ సినిమాలను థియేటర్లో విడుదల చేయడానికి సెన్సార్ బోర్డు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా కానీ వ్యూహం సినిమాను కచ్చితంగా ప్రజల్లోకి తీసుకు వస్తామని ఆర్జివీ చెబుతున్నారు..

Exit mobile version