Super Talented Kid: వారి ప్రతిభను ప్రదర్శించడానికి వయస్సు అర్హత కాదని నిరూపించింది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన 3 నెలల 24 రోజులున్న దెందె రేయాన్షి. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన దెందె సుస్మిత, ప్రవీణ్ దంపతుల మూడు నెలల చిన్నారి రేయాన్షి అద్భుతం సృష్టించింది. 3నెలల 24రోజులున్న రేయాన్షి 27పైగా ఫ్లాష్ కార్డ్స్ గుర్తించడంతో గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్, సూపర్ టాలెంట్ కిడ్ పోటీలకు తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోగా.. ఆ పాప టాలెంట్‌ను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆమెకు 27 జనవరి 2024న “సూపర్ టాలెంటెడ్ కిడ్” బిరుదును ప్రదానం చేసింది. ఆ చిన్నారిని “ఒన్ ఇన్ ఎ మిలియన్” అని గుర్తించింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారి చోటు దక్కించుకోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు చిన్నారిని అభినందించారు.
Read Also: Most Expensive Maggie : ఈ మ్యాగీ చాలా ఖరీదైనది.. ఎందుకో తెలుసా?
మూడు నెలల వయస్సులోనే ఉన్న అద్భుత గ్రహణ శక్తిని ఆ పాప తల్లి గుర్తించింది. ఆ గ్రహణ శక్తిని మరింత పెంపొందించేందుకు వివిధ రకాల ఫ్లాష్ కార్డ్స్‌తో ప్రయత్నించింది. ఎలాగైనా తమ పాప ప్రతిభను ప్రపంచానికి తెలియజెప్పాలని ఆ తల్లిదండ్రులు గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, సూపర్ టాలెంట్ కిడ్ పోటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే “సూపర్ టాలెంటెడ్ కిడ్” గా ఆ చిన్నారి గుర్తించబడింది. నోబుల్ వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఇంటర్నేషనల్ రికార్డ్స్‌లో కూడా ఎలిజిబుల్ అయ్యిందని, ప్రాసెస్ జరుగుతోందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మూడు నెలల చిన్నారి ఇంత చిన్న వయస్సు లోనే ఇంతటి ప్రతిభను కనపర్చటం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు దక్కటం తమకు ఎంతో తృప్తిని ఇచ్చిందని తెలిపారు తల్లి సుస్మిత పాపను భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకునే దిశగా పాపకు శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు.