CM Revanth Reddy: కేరళం యువత హార్డ్ వర్కింగ్ పీపుల్ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. తాజాగా కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో కేరళం యువత పాత్ర కీలకమన్నారు. కేరళంలోనే విషాద స్టోరీలకు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (United Democratic Front) ప్రభుత్వం చరమాంకం పలుకుందన్నారు. యూడీఎఫ్ గవర్నమెంట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పినరయి విజయన్ అంటే తనకు గౌరవమని.. కానీ ఆయన ప్రభుత్వం అంటే తనకు నచ్చదన్నారు. ఊమెన్ చాండీ కరుణాకరన్ ఆధ్వర్యంలో కేరళ అభివృద్ధి చెందిందన్నారు.
READ MORE: Trisha: త్రిష ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
“కేరళంకు పినరయి విజయన్, మోడీలు వద్దు. పినరయి విజయన్ జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీలను మరచిపోయి చాలా కాలం అయ్యింది. ఎన్డీఏ తరపున పినరయి విజయన్ కేరళంలో పని చేస్తున్నారు. కేరళంలో ప్రతి సమస్యకు కారణం పినరయి విజయన్. గత పదేళ్లుగా పినరయి విజయన్ కాకుండా మరో వామపక్ష నేత లీడర్‌గా లేరు. 2023కు ముందు తెలంగాణను తాను తప్ప ఎవరు నడిపించ లేరు అని పినరయి విజయన్ స్నేహితుడు కేసీఆర్ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ వచ్చి తెలంగాణలో అభివృద్ధి చేస్తోంది. కేరళంలో యూడీఎఫ్ వచ్చి పినరయి విజయన్ కోటను బద్దలు కొడుతుంది. మోడీ పినరయి విజయన్ పేరుతో కేరళంలోకి ఎంటర్ అవుతున్నారు. మోడీ, పినరయి విజయన్ ఇద్దరూ బ్రదర్స్. కేరళంలో పినరయి, ఢిల్లలో మోడీ మంచి మిత్రులు.” అని సీఎం రేవంత్ తెలిపారు.
