Site icon NTV Telugu

DR. BR.Ambedkar: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద అంతరిక్షంలో నక్షత్రం

Ambedkar

Ambedkar

DR. BR.Ambedkar: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇకపై మనకు ఆకాశంలో నక్షత్రంగా మెరుస్తూ కనిపిస్తారు. బడుగు జీవుల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆయన 132వ జయంతి సందర్భంగా.. ఆయన పేరును ఓ నక్షత్రానికి పెట్టారు. అంబేద్కర్ మహాపరినిర్వాణం (డిసెంబర్ 6, 1956) తర్వాత.. అతని అంత్యక్రియల ఊరేగింపులో అనేక ప్రకటనలు చేయబడ్డాయి. అందులో ‘జబ్ తక్ సూరజ్ చంద్ రహేగా బాబా తేరా నామ్ రహేగా..!’( ఆ సూర్యచంద్రులు ఉన్నంతకాలం.. అంబేద్కర్ పేరు కూడా చిరస్థాయిగా నిలిచివుంటుంది) అంటూ కీర్తించారు. 67 ఏళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు పాక్షికంగా అది కార్యరూపం దాల్చింది. ఛత్రపతి సంభాజీ నగర్‌లోని భీస్ సైనిక్ విభాగం.. ఓ నక్షత్రాన్ని కొని.. దానికి అంబేద్కర్ పేరు పెడుతూ.. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది.

సంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మున్సిపల్ స్టాండింగ్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాజు షిండే అంతరిక్షంలో నక్షత్రాన్ని నమోదు చేశారు. బాబాసాహెబ్ 132వ జయంతి సందర్భంగా ‘డా. బాబాసాహెబ్ అంబేద్కర్’ స్టార్ లాంచ్ చేయబడుతుంది. ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు ఈ తారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతరిక్షంలో నక్షత్రాలను నమోదు చేసే ‘ఇంటర్నేషనల్ స్టార్ అండ్ స్పేస్ రిజిస్ట్రీ’ అనే సంస్థ అమెరికాలో ఉంది. ఈ సంస్థ ద్వారా అంతరిక్షంలోని నక్షత్రాలకు వ్యక్తుల పేర్లను ఇస్తారు. ఫ్రాన్స్‌కు కూడా ఇలాంటి సంస్థ ఉంది. వంద డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో తొమ్మిది వేల రూపాయలు చెల్లించి నక్షత్రం నమోదు చేయబడుతుంది.

Read Also: Current Shock: ఇంట్లో శుభకార్యం.. అకస్మాత్తుగా కరెంట్ షాక్..

ఆ సంస్థలో బాబాసాహెబ్ పేరు మీద ఒక నక్షత్రాన్ని నమోదు చేయడానికి ఫిబ్రవరి 9, 2023న దరఖాస్తు చేయబడింది. ఒక నెల తర్వాత షిండేకు ఆ సంస్థ అంబేద్కర్ పేరు పెడుతూ సర్టిఫికేట్ పంపింది. ఈ నక్షత్రాన్ని స్పేస్ రిజిస్ట్రీ యాప్ వెబ్‌సైట్ https://space-registry.org నుండి మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్‌లో వీక్షించవచ్చు. ఈ నక్షత్రాన్ని Android మరియు iOS కోసం ది ఇన్నోవేటివ్ యూనివర్స్ స్టార్ ఫైండర్ 3D స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కూడా చూడవచ్చు. అంతే కాకుండా ప్లే స్టోర్‌కి వెళ్లి స్పేస్ రిజిస్ట్రీ లేదా స్టార్ నేమింగ్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యాప్‌లోకి వెళ్లి రిజిస్ట్రీ నంబర్ CX26529US ఎంటర్ చేసిన తర్వాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కనిపించవచ్చు. వికీపీడియాలోని సమాచారం ప్రకారం.. కంటితో చూడగలిగే సుమారు 10,000 నక్షత్రాలలో, కేవలం 336 నక్షత్రాలు మాత్రమే నమోదు చేయబడ్డాయి. వివిధ శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, కళాకారుల పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన బాబాసాహెబ్‌ అంబేద్కర్ పేరు చేర్చనున్నారు.

Exit mobile version