NTV Telugu Site icon

Redmi 12C: రెడ్ మీ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్..ఫీచర్స్ ఇవే..!

Red Mi 12c

Red Mi 12c

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఫోన్ లేకుండా పిల్లలు కూడా ఉండరు.. ఇక జనాల అవసరాలను బట్టి ఆయా కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నారు.. తాజాగా ప్రముఖ ఏలెక్ట్రానిక్ కంపెనీ రెడ్ మీ కంపెనీ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. రెడ్‌మీ 12 సీ పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుదని కంపెనీప్రముఖ అధికారులు చెబుతున్నారు  . 4 జీబీ +64 జీబీ, 6 జీబీ +128 జీబీ వేరియంట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వర్చువల్ మెమరీ తో కలిపి ఈ ఫోన్ 7 జీబీ ర్యామ్‌తో వస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. లావెండర్ పర్పుల్, మింట్ గ్రీన్, మ్యాట్ బ్లాక్, రాయల్ బ్లూ షేడ్స్‌తో ఈ ఫోన్ అందరినీ ఆకర్షిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ ఫోన్ ఫీచర్స్ ఇవే..

6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 120 హెచ్‌జెడ్ శాంప్లింగ్ రేట్.. అలాగే 500 నిట్స్ బ్రైట్‌నెస్..ఐపీ 52 ద్వారా వాటర్, డస్ట్ రెసిస్టెంట్
మీడియా టెక్ హీలియో జీ 85 ప్రాసెసర్..
సెపరేట్ మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా 1 టీబీ వరకూ మోమరీని విస్తరించే అవకాశం ఉంది.. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ద్వారా ఫోన్ పనిచేస్తుంది..
10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ క్యాపాసిటి ఉంటుంది.. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ను కలిగి ఉంటుంది..
4 జీబీ +64 జీబీ వేరింట్ ధర రూ. 8799గా ఉంటే 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.10,799గా ఉంది. ఇకపోతే ఐడీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా తగ్గింపు ఆఫర్ వస్తుంది.. అంతేకాదండోయ్ పాత ఫోన్ ఎక్సెంజ్ ఆఫర్ కుడా ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..