NTV Telugu Site icon

R Ashwin: కమిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించాల్సిందే!

Ashwin New Record

Ashwin New Record

R Ashwin Said Abdomen Injury trouble Me: ఒక్కసారి ఫ్రాంచైజీ కోసం కమిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించైనా ఫలితం అందించాలని రాజస్థాన్ రాయల్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ అన్నాడు. ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో తన శరీరం అనుకున్నంతమేర సహకరించలేదని, పొత్తికడుపులో గాయం ఇబ్బందికి గురి చేసిందని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ ఆడి నేరుగా టీ20 ఫార్మాట్‌కు రావడంతో లయను అందుకోవడానికి కాస్త సమయం పట్టిందని యాష్ పేర్కొన్నాడు. భారీ హిట్టర్లు ఉన్న బెంగళూరు జట్టును ఎలిమినేటర్ మ్యాచ్‌లో అశ్విన్‌ తన స్పిన్ మాయాజాలంతో అడ్డుకున్నాడు. తన కోటా 4 ఓవర్లలో 19 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ఆర్ అశ్విన్‌ మాట్లాడుతూ… ‘లీగ్ దశలో చివరి నాలుగు మ్యాచుల్లో ఓడిపోయాం. కొన్ని విభాగాల్లో ఇబ్బంది పడ్డాం. ప్రత్యర్థి జట్ల ముందు భారీ స్కోర్లు ఉంచలేకపోయాం. జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోయాడు. షిమ్రాన్ హెట్‌మయెర్‌ ఈ మ్యాచ్‌కు ముందు గాయపడ్డాడు. ఈ విజయం మాకు అత్యంత కీలకం. అందరూ బాగా ఆడారు. ఈ విజయం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. రెండో క్వాలిఫయర్‌లో మరింత ఉత్సాహంగా పోరాడతాం. ముందుగా మా లక్ష్యం ఫైనల్ చేరడం’ అని తెలిపాడు.

Also Read: IPL 2024 Final: టెన్షన్ పడకండి.. ఐపీఎల్‌ 2024 ఫైనల్‌కు షారుక్‌ ఖాన్‌ వస్తాడు: జూహీ చావ్లా

‘ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో నా శరీరం పెద్దగా సహకరించలేదు. పొత్తికడుపులో గాయం ఇబ్బందికి గురి చేసింది. గాయం నుంచి కోలుకుని వచ్చా. టెస్టు క్రికెట్ ఆడి నేరుగా రావడంతో టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా బౌలింగ్‌ లయను అందుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఫ్రాంచైజీ కోసం కమిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించైనా ఫలితం ఇవ్వాలి. ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్‌ సరైన లెంగ్త్‌తో బౌలింగ్‌ ప్రారంభించాడు. స్వింగ్‌ను రాబట్టాడు. మా బ్యాటర్లు అద్భుతమైన షాట్లతో బెంగళూరుపై ఆధిపత్యం ప్రదర్శించారు. అనుభవం కలిగిన క్రికెటర్లతో పాటు యువకులూ జట్టులో ఉండటం మా బలం. హెట్‌మయెర్ కీలక సమయంలో జట్టులోకి వచ్చాడు. రోవ్‌మన్ పావెల్ ఎలాంటి ఒత్తిడి లేకుండా మ్యాచ్‌ను ముగించాడు’ అని యాష్ చెప్పాడు.