NTV Telugu Site icon

Raviteja : ఓవర్ చేయకు రోయ్.. నీ దిష్టే తగిలేలా వుంది..

Raviteja (1)

Raviteja (1)

Raviteja : మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.కానీ రవితేజ తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్” ‘నామ్ తో సునా హోగా ‘ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.రవితేజ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో షాక్ ,మిరపకాయ్ వంటిసినిమాలు తెరకెక్కాయి.తాజాగా వస్తున్న’మిస్టర్ బచ్చన్’ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి.ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

Read Also :Kalki 2898 AD : ప్రభాస్ కల్కి లో విజయ్ దేవరకొండ క్యామియో రోల్ ..?

ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా రవితేజ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్ లో కనిపించి అలరించాడు.ఈ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సినిమా నుంచి మేకర్స్ షో రీల్ రిలీజ్ చేసారు..ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షో రీల్ సాగింది.ఈ సినిమాలో రవితేజ లుక్స్, యాక్షన్ అదిరిపోయింది.తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.ప్రస్తుతం ఈ సినిమాలో ఓ సాంగ్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ కు వెళ్ళింది.షూటింగ్ స్పాట్ లో రవితేజ ఫోటో పోస్ట్ చేస్తూ హరీష్ శంకర్ ఇలా రాసుకొచ్చారు.ప్రపంచకంలో అందరికి వయసొస్తుంది ఒక్క అన్నయ్యకి తప్ప అంటూ ..కాశ్మీర్ లోయలో అద్భుతంగా షూటింగ్ చేసాం త్వరలో హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాం అంటూ ట్వీట్ చేసారు.ఈ ట్వీట్ కు రవితేజ తాజాగా రియాక్ట్ అయ్యారు.ఓవర్ చేయకురోయ్..నీ దిష్టే తగిలేలా వుంది అంటూ ట్వీట్ చేసారు.

Show comments