Ravi Shastri: మరికొన్ని గంటల్లో భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రెండు జట్లు తపడనున్నాయి. అయితే.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. టీ20 వరల్డ్‌కప్‌లో అజేయంగా సూపర్ ఎయిట్ దశకు చేరింది. నెదర్లాండ్స్‌పై గెలుపుతో వరుస విజయాలు కూడగట్టుకుంది. బెటర్ బ్యాటింగ్, బెస్ట్ బౌలింగ్ ఆప్షన్లు ఉండటం భారత్‌కు కలిసి వచ్చింది. అయితే.. తాజాగా టీమిండియాకు ఓ సెలక్షన్ తలనొప్పిగా మారిందని మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అభిప్రాయపడ్డారు.
READ MORE: Jagapathi Babu: ఆ సినిమా షూటింగ్‌కి వెపన్ పట్టుకెళ్లిన జగపతి బాబు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో విజేత జట్టును మార్చే అవకాశం చాలా తక్కువ అని శాస్త్రి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవన్ బెటర్‌గానే ఉందని, అవసరమైన అన్ని ఆప్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. డ్యూ ప్రభావం ఉండే పరిస్థితుల్లో అదనపు బౌలింగ్ ఆప్షన్ ఎంతో కీలకమని చెప్పారు. అవసరమైతే శివమ్ దూబె (Shivam Dube), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పూర్తి కోటా బౌలింగ్ చేయడం లేదా తిలక్ వర్మ (Tilak Varma) ఒకటి రెండు ఓవర్లు వేయగలగడం వంటి సౌకర్యాలు జట్టుకు ఉపయోగపడతాయని వివరించారు. ఈ టోర్నీలో భారత్ విజయాలకు ఒకే ఆటగాడిపై ఆధారపడొద్దని శాస్త్రి తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఇషాన్ కిషన్ (Ishan Kishan), మరోసారి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), అలాగే తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు తమ పాత్ర పోషించారని చెప్పారు. వరుసగా మూడు డక్స్ వచ్చినప్పటికీ అభిషేక్ వర్మపై (Abhishek Sharma)పై రవి సానుకూలంగా స్పందించారు. కీలక మ్యాచ్‌ల్లో అభిషేక్ బ్యాటింగ్ అవసరమని, ఇంత వరకు బెస్ట్ ఇన్నింగ్స్ లేకపోవడం ప్రత్యర్థి జట్లకు ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అయితే తుది జట్టులో ఒకే ఒక సందేహం ఉందని శాస్త్రి చెప్పారు. స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లో అక్షర్ పటేల్ (Axar Patel) లేదా సుందర్ (Washington Sundar)లో ఎవరికీ అవకాశం ఇవ్వాలన్నదే ఆ కీలక నిర్ణయమన్నారు. అహ్మదాబాద్‌లోని మెడీ స్టేడియంలో భారత్–దక్షిణాఫ్రికా మ్యాచ్ హై వోల్టేజ్ పోరుగా ఉండబోతోందని శాస్త్రి అంచనా వేశారు. ఇరు జట్లకూ బలమైన బ్యాటింగ్ నైపుణ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉందని చెప్పారు.
READ MORE: Tamil Nadu: తమిళనాడులో ఉగ్ర కలకలం.. పాక్ కోసం బంగ్లాదేశీయుల గూఢచర్యం..
