Site icon NTV Telugu

Anantapur: డిగ్రీ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులపై ఎలుకల దాడి..

Rat

Rat

అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ ఘటనలో పది మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు రాకుండా ప్రిన్సిపాల్ గోప్యంగా ఉంచారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు గోప్యంగా వ్యాక్సిన్ వేయించారు. విద్యార్థినులు నిద్రిస్తున్నప్పుడు ఎలుకలు కొరికాయి. హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణ వల్ల రూమ్ లోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థినులు వాపోతున్నారు.

READ MORE: UK: పాక్ అధికారి కవ్వింపు.. పీక కోస్తామంటూ ప్రవాస భారతీయులకు బెదిరింపు.. వీడియో వైరల్

నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనంలో ఎలుకల బెడద ఉందని చెబుతున్నారు. ఎలుకలు విద్యార్థులను కొరికిన తర్వాత… హాస్టల్ రూములు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించామని కాలేజీ యాజమాన్యం తెలిపింది. విద్యార్థినులు కూడా బయట నుంచి రూమ్ లోకి స్నాక్స్ తీసుకొని రావడం వల్ల ఎలుకలు వస్తున్నాయని వార్డెన్ సాకులు చెబుతున్నారు.

READ MORE: Shraddha Srinath : ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ రిలీజ్..

Exit mobile version