NTV Telugu Site icon

Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ‘ఉద్యోగ రత్న అవార్డు’

Ratan Tata

Ratan Tata

Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాకు తొలి ‘ఉద్యోగరత్న అవార్డు’ ప్రదానం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ వెల్లడించారు. యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, మరాఠీ పారిశ్రామికవేత్తలకు కూడా అవార్డులు అందజేస్తామని సామంత్ గురువారం రాష్ట్ర శాసనమండలిలో తెలిపారు.

సమంత్ మాట్లాడుతూ, “విశిష్ట వ్యక్తులకు ఇచ్చే మహారాష్ట్ర భూషణ్ అవార్డు వలె, రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటాకు ఉద్యోగ రత్న అవార్డును ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పడింది. ఇందులో సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఉన్నారు. అజిత్ పవార్ పరిశ్రమల శాఖ మంత్రి.

Read Also:Samsung Galaxy Tab S8: సామ్ సంగ్ గెలాక్సీ టాబ్ S8 ధర రూ.8,000 తగ్గింపు.. ఈ కార్డ్ ఉంటే మరో రూ.6000

ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం
ఇటీవల 85 ఏళ్ల రతన్ టాటాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం లభించింది. భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో రతన్ టాటా చేసిన కృషికి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు లభించింది. ఈ విషయాన్ని భారత్‌లోని ఆస్ట్రేలియా రాయబారి బారీ ఓ ఫారెల్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియాలోనూ రతన్ టాటా సహకారం అందించారని ఆయన అన్నారు.

1991లో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌
నిరాడంబర స్వభావానికి పేరుగాంచిన రతన్ టాటా మార్చి 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2012లో తన పదవి నుండి వైదొలిగారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ఎన్నో మైలురాళ్లను సాధించింది. 2008లో అతనికి భారతదేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మవిభూషణ్ లభించింది.

Read Also:Pakistan: కూల్ డ్రింక్స్‎కు మతం పేరు.. అహ్మదీయ ముస్లిం కంపెనీ జ్యూస్‌పై జరిమానా..!