Site icon NTV Telugu

Rashmika Meets Dr AV Gurava Reddy: ఆర్థోపెడిస్ట్‌ గురవారెడ్డిని కలసిన రష్మిక

Rashmika

Rashmika

టాలీవుడ్, బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ రష్మిక. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బడాబడా మూవీస్ లో నటిస్తున్న రష్మిక తన బిజీ షెడ్యూల్‌లో టాప్ ఆర్థోపెడిస్ట్‌ గురువారెడ్డిని కలవటం విశేషాన్ని సంతరించుకుంది. నిజానికి తను గత కొంత కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే వీలు చూసుకుని డాక్టర్ గురువారెడ్డిని సంప్రదించింది. ఇదే విషయాన్ని గురువారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ రష్మిక తన వద్దకు వచ్చినట్లు తెలియచేస్తూ… పెద్దగా కంగారు పడాల్సిన పని లేదన్నారు. ‘పుష్ప’ సినిమా చూసిన తర్వాత రష్మికకి అభిమానిని అయ్యానన్నారు గురువారెడ్డి.

 
“నువ్వు ‘సామి..సామి..’ అంటూ
మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే
ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!” అని
మోకాలి నొప్పి అంటూ
నా దెగ్గరకు వచ్చిన ‘శ్రీవల్లి’కి
సరదాగా పెదవి విరుస్తూ ఇలా అన్నాను..
పుష్ప సినిమా చుసిన మొదలు,
రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు
ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది!
బన్నీ కూడా త్వరలో Shoulder pain తో వస్తాడు ఏమో..

ఇక త్వరలోనే భుజం నొప్పి అంటూ అల్లు అర్జున్ కూడా తనను సంప్రదించవచ్చంటూ జోక్ చేశారు. ఇదిలా ఉంటే రష్మిక నటించిన బాలీవుడ్ మూవీ ‘గుడ్‌బై’ విడుదలకు సిద్ధమవుతోంది. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించారు. అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక బన్నీతో ‘పుష్ప2’ సినిమా మొదలు కావలసి ఉంది.

 

 

 

Exit mobile version