NTV Telugu Site icon

Rashmi Gautam: మరో వివాదంలో రష్మీ..నెటిజన్స్ ఫైర్..

Rashmi

Rashmi

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మీ..జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటించి తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగ జీవాలను హింసిస్తే అసలు చూస్తూ ఉండలేదు. వాటిన ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి జంతుప్రేమికురాలిగా ఆమె చేసే ట్వీట్లు, పోస్ట్ లు మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి.. దాంతో వార్తల్లో నిలుస్తుంది… తాజాగా అలాంటి ట్వీట్ చేసి మరో వివాదంలో చిక్కుకుంది..

‘బక్రీద్ ‘ సందర్బంగా రష్మీ పోస్ట్ చేసింది..అందరిని తిడుతూ ఆమె చేసిన పోస్ట్ నెటిజన్ల నుంచి విమర్శలకు గురవుతోంది. రష్మీ ప్రతీ పండగ సందర్భాలలో ఇలాంటి పోస్ట్ లు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. జంతువులను హింసించి, బలి ఇచ్చే ఆచారాలపై మండిపడుతూ పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి ట్వీట్ ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇదే ఇప్పుడు రష్మీ గౌతమ్ ను విర్శలకు గురి చేస్తోంది. రష్మీ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎందుకు ప్రతీసారి పండగల సమయంలోనే జంతువుల మీద నీకు అంత ప్రేమ’ అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు..పెద్ద పెద్ద కంపెనీలు నాన్ వెజ్ లో వెరైటీలను చేస్తూ పెద్ద స్టార్స్ తో పబ్లిసిటీ చేయిస్తున్నారు.. వాళ్లను ఏం అడగవా అంటూ కామెంట్ చేశాడు..

గతంలో హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందాడు. ఆ ఘటన అందర్నీ కలచివేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కొంత మంది సెలబ్రెటీలు కూడా దీనిపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే రష్మిక కూడా కుక్కల దాడి ఘటనపై స్పందిస్తూ అందులో కుక్కల తప్పేమి ఉంది అన్నట్టు వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్స్ మండి పడ్డారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు..అప్పుడు ఆమెను బ్యాన్ చెయ్యాలి అంటూ వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి.. ఇక ఇప్పుడు వస్తున్న కామెంట్స్ పై రష్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..