NTV Telugu Site icon

Ranveer – Deepika : విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. ఇదే ప్రూఫ్?

Ranaveer Deepika

Ranaveer Deepika

ఈ మధ్యకాలంలో సినిమా హీరో హీరోయిన్లు ఇతర టెక్నీషియన్లు ప్రేమ వివాహాలు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఆ ప్రేమ వివాహాలు చేసుకోవడం ఎంత కామన్ అయిందో చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం కూడా సర్వసాధారణం అయిపోయింది. ఈ సోషల్ మీడియా యుగంలో ముందుగా వారు విడిపోతున్నారనే విషయం సోషల్ మీడియా పోస్టుల ద్వారానే కొంత క్లారిటీ వచ్చేస్తోంది.

ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మరో జంట విడిపోబోతున్నారని ప్రచారం మొదలైంది. ఆ జంట ఇంకెవరో కాదు రణవీర్ సింగ్ – దీపికా పడుకొనే. ఈ ఇద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే 2018లో వీరు వివాహం ఘనంగా జరిగింది. మీరు వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు చాలామంది హాజరయ్యారు కూడా . గత ఏడాది జరిగిన ఒక షోలో దీపిక చేసిన కామెంట్స్ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకునే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే ఆ తర్వాత ఆ ప్రచారం మరుగున పడింది కూడా.

అయితే ఇప్పుడు తాజాగా మరోసారి వీరి విడాకుల వ్యవహారం తెర మీదకు వచ్చింది. దానికి కారణం సోషల్ మీడియాలో దీపికతో వివాహానికి సంబంధించిన ఫోటోలను రణవీర్ సింగ్ డిలీట్ చేయడమే. ఆయన ఎందుకు డిలీట్ చేశారు? ఏమిటి? అనే విషయం క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియా నుంచి దీపికతో జరిగిన వివాహానికి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడంతో వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చినట్లయింది. ఒకపక్క దీపిక మరోపక్క రణవీర్ సింగ్ ఇద్దరు తమతో సినిమాల్లో బిజీగా ఉన్నారు. దీపిక అయితే పలు పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా బిజీబిజీగా గడుపుతోంది.

Show comments