బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.’యానిమల్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళం, మలయాళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఆగస్ట్ 11న అన్ని భాషల్లో పాటల్ని కూడా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1న ‘యానిమల్’ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ ఎంతో సీరియస్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.ఈ సినిమా నుంచి రీసెంట్ మేకర్స్ టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ చూసాక ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో మరోసారి రామాయణం పై సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇప్పటికే రామాయణం ఆధారంగా వచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా మేకింగ్‌పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఆలోచించకుండా ఇప్పుడు బాలీవుడ్ లో నితీష్ తివారీ రామాయణాన్ని మూడు భాగాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. రాముడిగా రణబీర్ కపూర్ , సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యశ్ నటిస్తారని సమాచారం..
ఇప్పుడు రామాయణం కోసం రణబీర్ కపూర్ తన లైఫ్ స్టైల్‌ను కూడా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటించడంపై ఎన్నో వివాదాలు తలెత్తున్నాయి. ప్రముఖ నటి కంగనా కూడా ఈ విషయంపై విమర్శలు కూడా చేసారు.. దీంతో ఈ విషయాన్ని రణబీర్ కపూర్ ఎంతో సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాముడి పాత్రలో నటించేందుకు మాంసాహారం, మద్యం మానేసినట్లు తెలుస్తోంది. రామాయణం షూటింగ్ పూర్తయ్యే వరకు ఇలాగే ఉండనున్నాడని బాలీవుడ్ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది.అయితే రణబీర్ కపూర్ నిజంగా మారుతున్నాడా లేక ఇది కేవలం పబ్లిసిటీ స్టంటా..అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత రణబీర్ ఆల్కహాల్ పూర్తిగా మానేస్తాడని, మాంసాన్ని కూడా ముట్టుకోడని అతని సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కాదు. తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టురణ్ బీర్ సన్నిహితులు చెబుతున్నారు.
