NTV Telugu Site icon

Game Changer : శైలేష్ కొలను డైరెక్షన్ లో రాంచరణ్.. పిక్స్ వైరల్..

Gamechanger

Gamechanger

Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ ఛేంజర్”,,ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సీఎంఎం షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ “ఇండియన్ 2 ” సినిమాతో బిజీ గా ఉండటంతో “గేమ్ ఛేంజర్ ” షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఇండియన్ 2 సినిమా రిలీజ్ కు రెడీ అవ్వటంతో శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.

Read Also :Pawan Kalyan : బాలయ్య వచ్చేస్తున్నాడు.. మరి పవన్ ఎప్పుడో..?

ఇదిలా ఉంటే, ఈ మూవీని శంకర్ కాకుండా తెలుగు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గురించి శైలేష్ ని ప్రశ్నించగా.. తాను డైరెక్ట్ చేసిన మాట నిజమే అని, కానీ అవి ఇంపార్టెంట్ సీన్స్ కాదని చెప్పుకొచ్చారు. శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఆ సీన్స్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొన్నప్పటికీ కొన్ని సీన్స్ ని శైలేష్ కోలనే డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వైజాగ్ లో జరుగుతున్న కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ పై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే కేవలం చరణ్ సీన్స్ మాత్రమే కాకుండా, వైజాగ్ లో చేయవల్సిన కొన్ని సీన్స్ ని కూడా ఒకే సమయంలో చేస్తున్నారని సమాచారం. మల్టీపుల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఒకే సమయంలో వైజాగ్ లోని పలు ప్రాంతాలు షూటింగ్ ని జరుపుతున్నారని తెలుస్తుంది. దీనితో ఒక సెట్ లో శైలేష్ కొలను పాల్గొని డైరెక్ట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Show comments