Neelkantha bird: అయోధ్య రామ మందిరలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే అయోధ్య నగరం సర్వంగా సుందరంగా సిద్ధమైంది. దీంతో అయోధలో జై శ్రీరామ్ నినాదాలో మార్మోగిపోతుంది. ఇప్పటికే రామ భక్తులూ పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఈ సందర్బంగా రామ భక్తులు ఈ ప్రాణ ప్రతిష్ట దివ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని పవిత్రమైన నీలకంఠ పక్షిని చూసేందుకు వెళ్తున్నారు. ఆగ్రాలో పెద్ద సంఖ్యలో రామ భక్తులు చంబల్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీకి క్యూ కట్టారు. అక్కడ రామాయణంలో పేర్కొన్న నీలకంఠ పక్షిని చూసి వెనక్కి మరలి వస్తున్నారు. రాముడు ఈ పక్షిని చూసిన తర్వాతే లంకాధీశుడిని చంపేసి లంకను తన అదుపులోకి తెచ్చుకున్నట్లు రామాయణంలో ఉంది.
Read Also: Ayodhya Ram Mandir: అయోధ్యలో సందడి చేస్తున్న చిరంజీవి, రామ్ చరణ్.. అభిమానులతో స్పెషల్ మీట్..
ఇక, నీలకంఠ పక్షిని చూడాలనే సంస్కృతి చాలా ఏళ్ల నుంచి వస్తుంది. అచ్చం ఇలాంటి విషయంలో తెలంగాణలోనూ దసరా రోజున పాలపిట్ట చూడాలని ప్రజలు అంటారు. ఇలాంటిదే.. రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం రోజున ఈ నీలకంఠ పక్షిని చూడాలనే విషయం వెలుగులోకి వచ్చింది. రావణుడిని చంపడానికి ముందు రాముడు ఒక శమీ చెట్టును తాకి.. ఆ తర్వాత నీలకంఠ పక్షిని చూశాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఈ నీలకంఠ పక్షిని శివుడి అవతారంగానూ భక్తులు చూస్తారు.