Site icon NTV Telugu

PEDDI OTT Rights : రామ్ చరణ్ – బుచ్చి ‘పెద్ది’ డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లు పలికాయంటే

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా  బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ కు రీసెంట్ గా రిలీజ్ అయిన చికిరి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో మార్చి 27 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది పెద్ది.

కాగా పెద్ది సినిమా డిజిటల్ రైట్స్‌ డీల్ ను ఎప్పుడో క్లోజ్ చేశారు మేకర్స్. అయితే ఈ డీల్ కు సంబంధించిన వివరాలు తెలియవచ్చాయి. పెద్ది సినిమా అన్ని భాషల హక్కుల్ని కలిపి మొత్తం రూ.130 కోట్లకు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడైనట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఇంత భారీ ధర పలికిందంటే ఈ సినిమాపై క్రేజ్ ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అలాగే మ్యూజిక్ రైట్స్ కూడా మంచి ధర పలికాయి. ఎలాగు శాటిలైట్ డీల్ ఉండనే ఉంది. మొత్తంగా చూసుకుంటే కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే ప్రొడ్యూసర్‌కు జాక్‌పాట్ తగిలిందని చెప్పాలి. ప్రస్తుతం హైదారాబాద్ లో షూటింగ్ ముగించుకున్న పెద్ది నెక్ట్స్ షెడ్యూల్ ను ఢిల్లీలో ప్లాన్ చేశారు.

Exit mobile version