రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ బ్యూటీ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటించి మెప్పించింది.టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానితో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే.ఇదే విషయాన్ని ఆమె అధికారికంగా కూడా ప్రకటించింది. గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలలో బిజీ బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.
తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పటి నుంచి ఆమె పెళ్లి పై రక రకాల వార్తలు వస్తూనే వున్నాయి.. ఇప్పటికే గతంలో ఎన్నో సార్లు పెళ్లి విషయంపై స్పందించిన రకుల్ తాజాగా మరోసారి పెళ్లి విషయంపై స్పందించింది. తాజాగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ప్రియుడు జాకీ భగ్నాని అక్టోబర్లో మూడు ముళ్ళు బంధంతో ఒక్కటి కాబోతున్నారు అంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అక్టోబర్ నెలలో వారి పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.తాజాగా ఇదే విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. ఇంకా పెళ్లి గురించి మేము ఏమీ అనుకోలేదు. నేను పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో, మా అమ్మ నాన్నలు నన్ను ఎప్పుడు అడగలేదు. మీడియా మాత్రం డేట్స్ కూడా ఫిక్స్ చేసేస్తోంది.. భగ్నానితో ప్రేమ గురించి చెప్పినట్టే, ఈ రిలేషన్షిప్ కి తరువాత స్టెప్ అయిన మ్యారేజ్ గురించి కూడా నేను త్వరలోనే అందరితో పంచుకుంటాను అంటూ సమాధానం ఇచ్చింది రకుల్..
