NTV Telugu Site icon

Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ పెళ్లి..డెస్టినేషన్ వెడ్డింగ్?

Rakull (2)

Rakull (2)

రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో బిజీగా హీరోయిన్.. ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది.. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పట్నుండి బాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ భగ్నాని తో ప్రేమాయణం సాగించింది..

ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కెర్లు కొడుతూనే ఉంటాయి. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ జాకీ తో ఉన్న బంధాన్ని కూడా బయటపెట్టింది.. ఆ తర్వాత పబ్లిక్ గానే ఇద్దరు కలిసి బయట తిరుగుతూ కెమెరాలకు చిక్కుతూ వచ్చారు.. పెళ్లి పై వార్తలు రోజు వినిపించేవి.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. వీరిద్దరూ కలిసి త్వరలోనే పెళ్లి చేసుకో బోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమె ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుందని తెలుస్తోంది. అలాగే గోవా లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని,ఈ పెళ్లికి అతి తక్కువ మంది అతిధులను పిలుస్తుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే జాకీ భాగ్నాని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టారని సమాచారం.. మరి దీనిపై ఎప్పుడు ప్రకటన ఇస్తుందో చూడాలి మరి.. ఈ మధ్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..