NTV Telugu Site icon

Rakul preet Singh : ఆ సినిమా నా కెరీర్ లో స్పెషల్ మూవీ..

Rakul

Rakul

Rakul preet Singh : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ,రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్స్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబయ్ సింహ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందించారు.

Read Also :Kalki 2898 AD : కనీవినీ ఎరుగని స్థాయిలో ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్..?

ఈ సినిమా ఆడియో లాంచ్ ఇటీవలే ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఇండియన్ 2 సినిమాను మేకర్స్ జులై 12 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇండియన్ 2 రిలీజ్ అయిన 6 నెలలకు ఇండియన్ 3 సినిమాను రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.తాజాగా రకుల్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.రకుల్ మాట్లాడతూ “ఇండియన్ 2 ” సినిమా తన కెరీర్ లోనే ఎంతో స్పెషల్ మూవీ అని ఆమె తెలిపింది.ఈ సినిమాలో తన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని ఆమె తెలిపింది.దర్శకుడు శంకర్ గారి సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది.

Show comments