NTV Telugu Site icon

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ అందంగా కనపడటం కోసం ఇలా చేస్తుందా?

Rakul

Rakul

టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ల లిస్ట్ లో తక్కువ టైం లోనే చేరింది అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్.  వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరటం సినిమా తో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఈ భామ తాజాగా సోషల్ మీడియా లో ఫోటోలు షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.. ఒకటికి మించి మరొకటి ఉన్నాయి.. ఆ ఫోటోలకు ఏ విధంగా కామెంట్స్ వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం..

ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫెమస్ అయ్యింది.. ఇకపోతే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇక ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే రకుల్‌ తన అందం వెనకున్న సీక్రెట్‌ను బయటపెట్టింది..

స్లిమ్ గా కనిపించడం కోసం జిమ్ లో భారీ కసరత్తులు చేసే రకుల్ ప్రీత్ బ్యూటీ పార్లర్ కు వెళ్లడం చాలా తక్కువ ఎక్కువగా న్యాచురల్ గానే ట్రై చేస్తుందని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.. అసలేం చెప్పిందంటే రోజు విడిచి రోజు స్వచ్ఛమైన కొబ్బరి నూనె తో ముఖానికి, మెడకు మసాజ్‌ చేసుకుంటాను. ముఖం, మెడ మీది ట్యాన్‌ పోవడానికి వీలైనప్పుడల్లా టొమాటో తో రుద్దుకుంటాను. పెరుగులో పసుపు, శనగపిండి కలిపి దాన్ని ప్యాక్‌లా వేసుకుంటానని చెప్పుకొచ్చింది.. అదన్న మాట రకుల్ బ్యూటీ సీక్రెట్.. ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా బాలివుడ్ లో సినిమాలు చేస్తుంది.. మరోవైపు నిర్మాత తో ప్రేమలో ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటుందని సమాచారం..