Site icon NTV Telugu

Rajtarun-lavanya Love Fight: సినిమా రేంజ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య

Rajtarun

Rajtarun

Rajtarun-lavanya Love Fight: రోజుకో మలుపుతో, వాదోపవాదనలతో సినిమా రేంజ్ ట్విస్ట్‌లతో సాగుతోంది రాజ్‌తరుణ్ – లావణ్యల వ్యవహారం. తనను రాజ్‌తరుణ్ మోసం చేసాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడని, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో రాజ్‌తరుణ్‌కు సంబంధం ఉందని, తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించాడని నిన్న రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.

ఈ వాదనను ఖండిస్తూ లావణ్యపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు చేశాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది, వద్దని వారించినందుకు తనతో గొడవపడిందని, గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయిందని అన్నాడు. ఈ వ్యవహారాన్ని లీగల్ గానే ఎదుర్కొంటానని తెలిపాడు. లావణ్య తనకు ఆన్ లైన్‌లో పరిచయం అయిందని, హీరోగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో సహాయం చేసింది, అంతే తప్ప ఆమెతో నాకు ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేదు. లావణ్య మస్తాన్ సాయి వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిపాడు.

కాగా లావణ్య ఫైల్ చేసిన కేసుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో భాగంగా నిన్న సాయంత్రం 91 సీఆర్‌పీసీ కింద లావణ్యకు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. రాజ్ తరుణ్‌పై చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాలని లావణ్య ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. లావణ్య పోలీసులకే ట్విస్ట్ ఇచ్చింది. పోలీసులు ఆధారాలు సమర్పించమని కోరినప్పటి నుంచి లావణ్య అందుబాటులో లేదని
తెలుస్తోంది. ఆమెను ఫోన్‌లో అందుబాటులోకి తీసుకుందామని ప్రయత్నించగా.. మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందని సమాచారం.

కాగా నేడు మీడియా ముఖంగా అన్ని వివరాలు తెలియజేస్తానని చెప్పిన లావణ్య పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎవరి వాదనలో ఎంత నిజముందో పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

 

Exit mobile version