రాజస్థాన్ పోలీసులు మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 12,854 ప్రదేశాలపై దాడులు చేసి మొత్తం 8,950 మందిని అరెస్ట్ చేశారు. వాంటెడ్ క్రిమినల్స్, సంఘవిద్రోహులు, నేర కార్యకలాపాలకు పాల్పడిన ఇతర వ్యక్తులను అరెస్టు చేశారు. 18,826 మంది పోలీసు అధికారులు, ఉద్యోగులతో కూడిన 4,143 బృందాలు 12,854 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా 8,950 మందిని అరెస్టు చేసినట్లు రాజస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా తెలిపారు.
Also Read:Red Alert : తెలంగాణలో కొనసాగుతున్న వర్షం.. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్
బికనీర్ పరిధిలో 3,304 మంది పోలీసు అధికారులు, ఉద్యోగులతో కూడిన 806 బృందాలు 2,997 చోట్ల దాడులు చేసి మొత్తం 924 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) దినేష్ ఎంఎన్ తెలిపారు. జైపూర్ కమిషనరేట్‌లో 3,090 మంది పోలీసు అధికారులు, ఉద్యోగులతో కూడిన 1,029 బృందాలు 1,029 చోట్ల దాడులు నిర్వహించి మొత్తం 296 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.