NTV Telugu Site icon

Rajamouli :అప్పుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా

Whatsapp Image 2023 11 27 At 10.16.48 Pm

Whatsapp Image 2023 11 27 At 10.16.48 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్..ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత సందీప్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సందీప్ ఈ సినిమాను వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.డిసెంబర్ 1 న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్ మరియు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ సినిమాలో అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించగా.. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కు డైరెక్టర్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శక దీరుడు రాజమౌళి యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తారు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీస్తారు..ఎంతగానో పేరు సంపాదిస్తారు. దానిని మనం చూస్తూనే ఉంటాము. కానీ సినిమా అంటే ఇలానే తీయాలి అనే డైరెక్టర్స్ అప్పుడప్పుడు వస్తూ వుంటారు. అలాంటి డైరెక్టర్స్ నా తరం లో వచ్చిన వ్యక్తి రాం గోపాల్ వర్మ..ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాంటి డైరెక్టర్ మాత్రం సందీప్ రెడ్డి వంగా అంటూ దర్శకుడు సందీప్ ను ఎంతగానో మెచ్చుకున్నారు..