Matrimony Fraud: అందమైన సూటు బూటు, మెడలో బంగారు వస్తువులు, లగ్జరీ కార్లతో తెలుగు మ్యాట్రిమోనీ, సాదీ డాట్ కం. వెబ్ సైట్ లతో ఒంటరి మహిళలను పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఘరానా మోసగాడి గుట్టురట్టయింది. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు వల పర్ని ఘరానా మోసగాడిని పట్టుకున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న చిత్తూరుకు చెందిన నిందితుడు పోలీసులకు చిక్కి కటకటాలు పాలయ్యాడు.
READ MORE: Balochistan: బలూచిస్తాన్‌లో విరుచుకుపడిన BLA.. 10 మంది పాక్ అధికారులు మృతి..
పైన ఫోటోలో సూటు బూటుతో బంగార ఆభరణాలతో కనిపిస్తున్న చిత్తూరుకు చెందిన చల్లా నారాయణ అలియాస్ కృష్ణ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. సాది డాట్ కం, తెలుగు మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన ఫోటోలను, సెల్ నెంబర్, పోస్టు చేస్తాడు. పెళ్లి కోసం వచ్చే ఫోన్లను సంప్రదించి మహిళలను తెలివిగా బురిడీ కొట్టిస్తూ బంగారు వస్తువులను కొట్టేస్తున్నాడు. ఒంటరి మహిళలు, పెళ్లి కానీ అమ్మాయిలే ఈతగాడి టార్గెట్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మీకు దోషం ఉంది ఒంటిపై బంగారు వస్తువులను ధరించి రాజమండ్రి గోదావరి గట్టుకు రమ్మని చెప్తాడు. పుష్కర్ ఘాటు, కోటిలింగాలు ఘాటులలో పూజలు చేయిస్తానని నమ్మిస్తాడు. ఈ మోసగాడు మాటలు నమ్మి విలువైన బంగారపు వస్తువులను అప్పచెప్పుతున్నారు. ఇదిగో అది తీసుకుని వస్తా ఇది తీసుకుని వస్తా అంటూ మాటలు చెప్పి అక్కడ నుంచి కారుతో ఉడాయిస్తున్నాడు. ఈ రకంగా పలువురు మహిళలను మోసగించి 75 లక్షల రూపాయలు విలువైన 340 గ్రాముల బంగారు ఆభరణాలు కొట్టేశాడు. బాధితులు ఈ మేరకు రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు.
ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలు మేరకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చల్లా నారాయణ అలియాస్ కృష్ణ వివరాలు సేకరించారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు వల పన్నీ చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. మహిళలను మోసం చేసిన అయిదు చీటింగ్ కేసుల్లో నిందితుడు చల్లా నారాయణను అరెస్ట్ చేశారు నిందితుడు చల్లా నారాయణ నుంచి 75 లక్షల రూపాయలు విలువైన 340 గ్రాముల బంగారం వస్తువులు, రెండు కార్లు రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడినట్లు సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు. ఇతడు భార్యను చంపిన మర్డర్ కేసులోనూ నిందితుడుగా పేర్కొన్నారు. నిందితుడు చల్లా నారాయణ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చాలాకాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడని అన్నారు.
