NTV Telugu Site icon

Purushothamudu : ఊరంతా మెచ్చే ‘పురుషోత్తముడు’ వచ్చేశాడు..

Raj Trun

Raj Trun

యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఉయ్యాలా జంపాల సినిమాతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.. కాస్త సినిమాలకు గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అందులో ఒకటి ‘పురుషోత్తముడు’.. చాలా కాలం క్రితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాను రామ్ భీమన దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి టీమ్ టీజర్ ను రిలీజ్ చేసింది..

శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బేనర్ లో నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసిన ఇంకా విడుదలకు నోచుకోలేదు.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఆసక్తిగా మారింది. తాజాగా విడుదలైన సినిమా టీజర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఒకయుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడు అయ్యాడు.. అలాగే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహల్లాదుడు మహనీయుడు అయ్యాడు.. మాట కాదు ధర్మం అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగుతో టీజర్ ప్రారంభం అవుతుంది..

టీజర్ వీడియోను చూస్తుంటే సినిమా కథ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.. రాజ్ తరుణ్ పెర్ఫార్మన్స్ ఎప్పటిలాగే డీసెంట్ గా ఉంది.. మొత్తంగా టీజర్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాల పై అంచనాలు పెరుగుతున్నాయి.. భారీ తారాగణం తో సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీత దర్శకుడుగా వ్యవహారిస్తున్నారు.. రాజ్ తరుణ్ సరసన హాసిని సుధీర్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముఖేష్ ఖన్నా, రాజా రవీంద్ర,రాజ్ తిరన్ దాస్, రచ్చ రవి, కంచరపాలెం రాజు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు..

Show comments