తెలుగు స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి పరిచయాలు అవసరం లేదు… గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికి పరిచయమే… ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటను పాడారు.. ఆ సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో రాహుల్ వరల్డ్ ఫేమస్ సింగర్ అయ్యాడు.. ఇప్పుడు వరుస సినిమాల్లో పాడుతున్నారు.. ఇక రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.. ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటాడు.. ఈ క్రమంలో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు.. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది..
ఇదిలా ఉండగా ఎక్స్ లవర్ రతిక ఇటీవలే ముగిసిన షో కి హాజరైన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ లవర్స్ అని రతిక చెప్పేవరకు ఎవ్వరికీ తెలియలేదు. ఇక ఈమె ప్రతి ఒక్కరికి తమ రిలేషన్ గురించి చెప్పేసరికి రాహుల్ సిప్లిగంజ్ ఫైర్ అయ్యాడు కూడా. ఇక ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఆ హీరో మెసేజ్ చేస్తే ఈ పని చేస్తా ఆ పని చేస్తా అనే ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే చాలా మంది ఇది ఫాలో అవుతున్నారు..
తాజాగా ఓ యువకుడు రాహుల్ అన్న ఈ వంటకు కామెంట్ చేస్తే చాలు నేను వంటను నేర్చుకుంటానని దాన్ని మాడిపోయేల చేశాడు. లేకుంటే లేదు అనే ట్యాగ్ చేశాడు.. అది కాస్త రాహుల్ వరకు చేరింది.. దానికి స్పందించిన రాహుల్ రిప్లై ఇస్తూ చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు.. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..