NTV Telugu Site icon

Rahul Gandhi Cooks Bamboo Chicken : బొంగు చికెన్ వండిన రాహుల్ గాంధీ.. టేస్ట్ సూపర్

Maxresdefault (1)

Maxresdefault (1)

Rahul Gandhi Cooks Bamboo Chicken : మనిషన్నంక కాసింత కళాపోషణ ఉండాలె.. అన్నట్లు రాహుల్ గాంధీ ఎప్పుడూ రాజకీయాలు, పార్టీ కొట్లాటలు ఇలాంటి వాటిని పక్కన పెట్టి కాసేపు చెఫ్ గా మారారు. తానే స్వయంగా బొంగు చికెన్ వండి అందరికీ వడ్డించి ముచ్చట తీర్చుకున్నారు. ఈ అరుదైన వీడియోను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ శనివారం సోషల్ మీడియాలో విడుదల చేసింది. తెలుగు ప్రజలకు బొంగు చికెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెదురు బొంగులో చికెన్ వండే విధానం, దాని రుచి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాంటి బొంగు చికెన్ ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలతో కలిసి వండారు. అనంతరం పార్టీకి చెందిన తెలంగాణ నేతలు, గిరిజనులతో కలిసి బొంగు చికెన్ రుచి చూశారు.

Read Also: AP Weather Alert: భారీ వర్షాలున్నాయి.. తస్మాత్ జాగ్రత్త

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవలే మహారాష్ట్రలో అడుగుపెట్టింది. తెలంగాణలో యాత్ర సాగుతున్న సమయంలో ఆయా ప్రాంతాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలపై రాహుల్ ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో యాత్ర సమయంలో టీపీసీసీ నేతలతో పాటు గిరిజనులతోనూ రాహుల్ గాంధీ పొలాల మధ్య సరదాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తన యాత్ర సాగిన తీరు, నేతల నుంచి అందిన సహకారంపై రాహుల్ చర్చించారు. ఈ సమయంలోనే గిరిజనులతో కలిసి రాహుల్ బొంగులో చికెన్ వండారు. అనంతరం నేతలకు చికెన్ ను ప్లేట్లలో నేతలతో పాటు గిరిజనులకు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. బొంగు చికెన్ ను రుచి చూసి అద్భుతమని గిరిజనులు, నేతలు కితాబిచ్చారు.