NTV Telugu Site icon

Raghuveera Reddy: రఘువీరారెడ్డి కుటుంబంలో విషాదం

Raghuveera Reddy

Raghuveera Reddy

Raghuveera Reddy: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన సీడబ్ల్యూసీ మెంబర్‌ ఎస్‌. రఘువీరారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.. రఘువీరా రెడ్డి అన్న శ్రీరామప్ప అనారోగ్యంతో మృతిచెందారు.. శ్రీరామప్ప వయస్సు 85 ఏళ్లు.. అన్న శ్రీరామప్ప మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రఘువీరారెడ్డి.. ఇక, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: Bazooka : వైరల్ అవుతున్న మమ్ముట్టి సెకండ్ లుక్..

కాగా, రఘువీరా రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా, మడకశిర నియోజక వర్గానికి చెందిన నీలకంఠాపురం అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఎన్. నరసమ్మ, ఎన్.కావేరప్ప. వారిది వ్యవసాయ కుటుంబం.. ఆయన పూర్వికులు నీలకంఠాపురంతో పాటు బెంగళూరులో స్థిరపడ్డారు.. 1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రఘువీరారెడ్డి.. 1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మళ్లీ 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2004 లో మరోసారి గెలుపొంది వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మరోసారి వైఎస్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. వైఎస్‌ మరణం తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డిల మంత్రివర్గంలో పనిచేసిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.. ఆ తర్వాత క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరం.. తన ఊరు, కుటుంబానికే పరిమితం అయ్యారు. కానీ, కర్ణాటక ఎన్నికల్లో ఆయన చురుగా పాల్గొన్నారు.. పార్టీ ఆయనకు అత్యున్నతమైన సీడబ్ల్యూసీ మెంబర్‌ను చేసి గౌరవించింది.