Site icon NTV Telugu

Raghunandan Rao: రాహుల్ గాంధీ నియోజకవర్గంలో 71 వేల 977 దొంగ ఓట్లు..!

Mp Raghunandanrao

Mp Raghunandanrao

Raghunandan Rao Questions Rahul Gandhi: రాయబరేలి రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికకు సిద్ధమా? అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట్లో బీజేపీ ఈవీఎంలను వ్యతిరేకించింది.. కానీ శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత ఈవీఎంలకి మద్దతు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్.. ఓడితే రాంగ్ అంటున్నారు.. రాజీవ్ గాంధీ ఆలోచన ప్రోగ్రెస్, రాహుల్ గాంధీ ఆలోచన డిస్ట్రక్టివ్ అని విమర్శించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని.. బంగ్లాదేశ్ అక్రమ వలస దారులను గుర్తించి ఓటు తీసేస్తారనే భయపుట్టుకుందన్నారు.

READ MORE: Vivo T4 Pro: మరో సంచలనానికి తెరలేపిన వివో.. డిజైన్, కెమెరా, ప్రాసెసర్ అప్‌గ్రేడ్స్‌తో రాబోతున్న కొత్త స్మార్ట్‌ఫోన్!

రాహుల్ గాంధీ గెలిచిన రాయబరెలిలో 2 లక్షల ఓట్లపై అనుమానం ఉందని.. 71 వేల 977 ఫేక్ ఓటర్స్ ఉన్నారనన్నారు ఎంపీ రఘునందన్‌రావు. 92 వేల 447 మాస్ ఓటర్ నమోదు చేశారని… 54 వేల ఫేక్ బర్త్ డే సర్టిఫికేట్‌లు పెట్టారని ఆరోపించారు. వయనాడ్, డైమండ్ హార్బర్ నియోజక వర్గాలపై కూడా అనుమానం ఉందన్నారు. డింపుల్, అఖిలేష్ యాదవ్ నియోజక వర్గాల్లో కూడా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. తన నియోజకవర్గంలో కూడా రోహింగ్యలకి ఓటు ఇచ్చారన్నారు. ఫారిన్ ఆర్గనైజేషన్ లు ఏజెన్సీలు దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయని.. ఫండింగ్ చేస్తున్నాయన్నారు. దొంగ ఓట్లుతో గెలిచారని కోర్టు చెబితే ఇందిరా గాంధీ ముఖం చూపించలేక కొంగు కప్పుకొని పోయిందని విమర్శించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించాలని సూచించారు.

READ MORE: Himachal Pradesh: హిమాచల్ లో భారీ వర్షాలు..కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు.

Exit mobile version