Site icon NTV Telugu

Paris Olympics 2024: ఆశలు అడియాసలే.. ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు ఔట్..

Pv Sindhu

Pv Sindhu

Paris Olympics 2024 PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌ లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పతకాల వేట ముగిసింది. 2016లో రజతం, 2020లో కాంస్యం గెలిచిన పీవీ సింధు.. ఈసారి ఒలింపిక్స్ 2024లో మాత్రం ప్రీక్వార్టర్స్‌ వరకే పరిమితమై ఖాళీ చేతులతో ఇంటి ముఖం పట్టింది. గురువారం రాత్రి జరిగిన ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్ లో పివి సింధు 19-21, 14-21 తేడాతో చైనా షట్లర్ ప్రపంచ 9వ ర్యాంకర్ హే బింగ్‌ జావ్ చేతిలో వరుస సెట్స్ లో ఓటమి పాలైంది. దింతో సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

IND vs SL: నేడే శ్రీలంక, టీమిండియా మొదటి వన్డే.. ఎవరి బలాబలాలేంటి?

ఈ మ్యాచ్ లో మొదటి గేమ్‌ లో ఇద్దరూ షట్లర్ల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. క్రాస్ కోర్ట్ షాట్స్‌ తో సింధు తనడైన శైలి లో రెచ్చిపోగా.. స్మాష్‌ లతో చైనా ప్లేయర్ పైచేయి సంపాదించింది. దాంతో తొలి గేమ్‌ను దక్కించుకుంది. నిజానికి పీవీ సింధు అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పవచ్చు. ఇక ఆట రెండో గేమ్ మొదలు నుంచే దూకుడు చూపించిన బింగ్‌ జావ్ వరుస పాయింట్స్‌ తో సింధు పై ఒత్తిడిని పెంచడంతో ఆ గేమ్ ను కోల్పోవడంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు.

Governors Conference : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అధ్యక్షతన రెండ్రోజుల పాటు గవర్నర్ల సదస్సు

ఇకపోతే భారత బ్యాడ్మింటన్ విభాగంలో ప్రస్తుతం లక్ష్యసేన్ మినహా అంతా ఇంటిదారి పట్టారు. ఇక అలాగే భారీ అంచనాలతో ఒలింపిక్స్ 2024 బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిలు కూడా క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగారు. గురువారం నాడు జరిగిన ఆ మ్యాచ్‌ లో రాంకీ రెడ్డి – చిరాగ్ శెట్టి 21-13, 14-21, 16-21 తేడాతో ఆరోన్ – సో వూయి (మలేషియా) చేతిలో ఓటమిని తప్పించుకోలేకపోయారు.

Exit mobile version