Putin- Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై చర్చించడానికి రెండు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. అయితే పుతిన్‌కు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతం ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. ట్రంప్ ఏడవసారి మాత్రమే అధ్యక్షుడు పుతిన్‌ను కలవబోతున్నారు. కానీ.. పుతిన్ మాత్రం తన హయాంలో ఐదుగురు అమెరికా అధ్యక్షులతో 48 సార్లు సమావేశమయ్యాయి. ట్రంప్-పుతిన్ మధ్య అనుభవ వ్యత్యాసం చాలా ఉంది.
READ MORE: Udaya Bhanu : వాళ్ల బండారం బయటపెడుతా.. యాంకర్లపై ఫైర్
పుతిన్ కలిసిన ఐదుగురు అమెరికా అధ్యక్షుల్లో బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ. బుష్, బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్ ఉన్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన పుతిన్, అమెరికన్ అధ్యక్షుల మధ్య సమావేశాలు 2025 వరకు కొనసాగుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలల అనంతరం.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను మాస్కోలో కలిశారు. రష్యా దేశాధినేత క్లింటన్‌ను క్రెమ్లిన్ (రష్యన్ ప్రభుత్వ కార్యాలయం) పర్యటనకు పంపడమే కాకుండా, వారిద్దరి ముందు ఒక రష్యన్ జాజ్ బృందం కార్యక్రమాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా.. రెండు ఆయుధ నియంత్రణ ఒప్పందాలపై సంతకం చేసినందుకు పుతిన్‌ను క్లింటన్ అభినందించారు. అక్కడ మొదలైన సమావేశాల పర్వం.. ఇప్పటి వరకు ఐదుగురు అధ్యక్షులు, 48 సమావేశాల వరకు కొనసాగింది. ఇదిలా ఉండగా.. తాజా భేటీతో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆపేస్తుందా..? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృషికి ఫలితం లభిస్తుందా..? ప్రపంచం అంతా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే ట్రంప్, పుతిన్ భేటీ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భేటీ అనంతరం వీళ్ల ప్రకటన అర్ధరాత్రి వచ్చే అవకాశం ఉంది.
READ MORE: Mahindra new SUVs 2025: ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. మహీంద్రా నుంచి 4 కొత్త SUV లు రిలీజ్
