Site icon NTV Telugu

Pushpa The Rule : పుష్ప 2 లో అదరిపోయే ఐటమ్ సాంగ్.. షూటింగ్ లో బిజీగా వున్న చిత్ర యూనిట్..

Whatsapp Image 2024 01 09 At 10.02.38 Pm

Whatsapp Image 2024 01 09 At 10.02.38 Pm

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప ది రూల్‌.. ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా వస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్‌ మరోసారి స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.బాక్సాఫీస్‌ను రూల్ చేసేందుకు పుష్ప ది రూల్‌ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో సందడి చేయనుందని మేకర్స్ ఇప్పటికే అప్‌డేట్ అందించిన విషయం తెలిసిందే.పుష్ప ది రైజ్‌ లో సమంత హాట్ హాట్‌ స్టెప్పులతో ఊ అంటావా సాంగ్‌ ఇండస్ట్రీని ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పుడు పుష్ప.. ది రూల్‌ నుంచి మరో అదిరిపోయే ఐటంసాంగ్‌ రాబోతుంది. సీక్వెల్‌లో వచ్చే ఈ పాట లో బాలీవుడ్ భామలు దిశాపటానీ మరియు కృతిసనన్‌ మెరువనున్నారు.

తాజా అప్‌డేట్ ప్రకారం అల్లు అర్జున్‌, కృతిసనన్‌ మరియు దిశాపటానీపై వచ్చే ఈ సాంగ్‌ను రామోజీఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పుష్ప రాజ్ మళ్లీ వస్తున్నాడు.. అంటూ మేకర్స్ షేర్ చేసిన లుక్‌ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.పుష్ప 2 లో ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌ మరియు శ్రీతేజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఫస్ట్ పార్టును మించేలా అదిరిపోయే స్టెప్స్‌ తో ఐటమ్ సాంగ్ రెడీ చేసినట్టు ఇప్పటికే ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మరోసారి అదిరిపోయే ఆల్బమ్‌ రెడీ చేస్తున్నట్టు సమాచారం..

Exit mobile version