Pushpa 2 : సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పుష్ప రాజ్.. తన బట్టలు ఎక్కడ కొన్నాడో తెలుసా..?
- పుష్ప రాజ్ కోసం పోచంపల్లి కాస్ట్యూమ్స్
- ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాగా నిలువబోతున్న పుష్ప 2
- లాంగ్ రన్‌లో సినిమా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గురించి ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటూ ఉంది. ప్రపంచంలో ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు అంతా పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి అయిదు రోజులు పూర్తి కాకుండానే రూ.1000 కోట్ల వసూళ్లు నమోదు చేసి అత్యంత వేగంగా ఈ ఫీట్ సొంతం చేసుకున్న సినిమాగా పుష్ప 2 సినిమా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే నార్త్ ఇండియాలో సినిమా వసూళ్లు అత్యధికంగా ఉన్నాయి. ఇలాంటి నంబర్స్ సౌత్ ఇండియాలో ఆశిస్తాం, కానీ నార్త్ ఇండియాలో అంతకు మించి వసూళ్లు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీహార్‌తో పాటు పలు నార్త్ రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో నాలుగు రోజుల పాటు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. అయిదవ రోజు అయిన సోమవారం సైతం చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో టికెట్లు దొరకలేదన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పుష్ప 2 సినిమా జోరు మామూలుగా లేదు. లాంగ్ రన్‌లో సినిమా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. అలాగే దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించిన విషయాలు, సినిమా కోసం వినియోగించిన సెట్ ప్రాపర్టీస్ సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Read Also:Sanjay Malhotra: నేడు ఆర్బీఐ నూతన గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు స్వీకరణ
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ఈ సినిమాలో బన్నీ విభిన్నమైన డ్రెస్‌లను ధరించాడు. ఆయన ధరించిన డ్రెస్‌ల్లో ఎక్కువ శాతం పోచంపల్లి చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. కంఫర్ట్‌తో పాటు నేచురల్‌గా ఉంటాయనే ఉద్దేశంతో అల్లు అర్జున్ కోసం ఇక్కత్ సికో పట్టును పుష్ప రాజ్ డ్రెస్‌ల కోసం వినియోగించారు. అల్లు అర్జున్ పర్సనల్ డిజైనర్ ఈ ఫ్యాబ్రిక్‌ను సెలెక్ట్ చేశారు. పుష్ప 2 సినిమా కొన్ని సన్నివేశాలను పోచంపల్లి ప్రాంతాల్లో చేశారు. అల్లు అర్జున్ ఒకటి రెండు సార్లు వచ్చాడంటూ స్థానికులు చెబుతుంటారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా నిలువబోతున్న పుష్ప 2 సినిమాకి పోచంపల్లితో రిలేషన్ ఉందని అక్కడి వారు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో అక్కడి వారు ఈ విషయాన్ని గురించి ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. రష్మిక మందన్నతో పాటు ఇతర యూనిట్ సభ్యులు వాడిన కాస్ట్యూమ్స్‌లో కొన్నింటిని సైతం పోచంపల్లి నుంచి తీసుకున్నారు. కొన్ని ముంబై నుంచి తీసుకోగా, కొన్ని రెగ్యులర్ షాప్స్ నుంచి తెప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. మొత్తానికి పుష్ప రాజ్ ను విభిన్నంగా చూపించడంలో పోచంపల్లి కాస్ట్యూమ్స్ కీలక పాత్ర పోషించాయి.
Read Also:Mohan Babu: మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి.. పోలీసు శాఖ సీరియస్..
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!