ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “…క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా కొనసాగింపుగా వస్తుంది.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు .ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న విడుదల చేయనున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్ ,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
రీసెంట్ గా అల్లుఅర్జున్ బర్త్డే సందర్భంగా మేకర్స్ “పుష్ప పుష్ప” సాంగ్ ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ సాంగ్ లో అల్లుఅర్జున్ వేసే స్టెప్స్ ట్రెండింగ్ గా నిలిచాయి.ప్రస్తుతం “పుష్ప పుష్ప” సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఇదిలావుంటే ఈ చిత్రం నుండి సెకండ్ సాంగ్ ను మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు..ఈ సాంగ్ ఎంతో స్పెషల్ గా వుండనుందని సమాచారం.పుష్ప జీవితం మొత్తం ఈ సాంగ్ లో చూపించనున్నట్లు సమాచారం. దీనితో ఫ్యాన్స్ సెకండ్ సాంగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
