బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. భారీ వేతనంతో బ్యాంకు జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకోం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
Also Read:Peddi : పెద్ది మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..
దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుండి రూ.85,920 వరకు జీతం అందిస్తారు.
Also Read:UPI Malaysia Launch: సాహో భారత్.. మలేషియాలో యూపీఐ అధికారిక సేవలు ప్రారంభం
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1,180గా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.59గా నిర్ణయించారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నిన్న, నవంబర్ 3న ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 23, 2025. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లి్క్ చేయండి.
