Site icon NTV Telugu

CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

Csk Vs Pbks

Csk Vs Pbks

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 3) జరిగే 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పంజాబ్ తమ మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం సాధించగా, చెన్నై రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం.

Exit mobile version